Ready to quit as Governor in support of farmers: Satya Pal Malik కేంద్రంపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఘాటు వ్యాఖ్యలు.!

Even when an animal dies satya pal malik s swipe at centre over farm laws

Meghalaya Governor, Satya Pal Malik, Delhi, farmer, Satya Pal Malik Meghalaya Governer, Farmers protest, Farmers protest Delhi, 600 farmers die, Dog Death Condolence, farmers death skiped, Agri based country, Meghalaya, Governer, Delhi Leaders, BJP Frontline leaders, Farmers life, Farmers protest, farm law, BJP, National, Politics

Declaring that he is willing to step down from his post for backing the farmers’ agitation, Meghalaya Governor Satya Pal Malik said leaders in Delhi offer condolences “even when a dog dies” but haven’t cared about the deaths’ of farmers.

కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గవర్నర్ సత్యపాల్ మాలిక్.!

Posted: 11/08/2021 12:42 PM IST
Even when an animal dies satya pal malik s swipe at centre over farm laws

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా తమ ఇళ్లు వాకిళ్లు వదిలి ఢిల్లీ వీధుల్లోకి చేరి నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా అధికార పార్టీకి చెందని నేత.. ఓ రాష్ట్ర గవర్నర్ తన గళం వినిపించారు. సొంత పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఎందుకు ఇంతలా రైతులను విస్మరించి వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ అధారిత దేశమైన భారత్ లోనే ఇలా ఎందుకు జరుగుతుంది.. జై జవాన్, జై కిసాన్ అన్న నినదించిన త్రిలింగ దేశంలో అన్నదాతల ఆర్థనాధాలు వినే పాలకులే కరువయ్యారా.? అంటూ నిలదీశారు.

ఇంతకీ ఆయన ఎవరు అంటారా..? ఆయన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. రైతు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడుతూ.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనపై తాను ఏం మాట్లాడినా అది వివాదాస్పదంఅవుతోందని అన్నారు. అలా మాట్లాడిన ప్రతిసారి ఢిల్లీ పెద్దల నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయితే ప్రస్తుతం తాను అలా అలోచించడం మానేశానని అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులన్నలకు మద్దతుగా నిలవడం తన ప్రాధాన భాద్యతని చెప్పుకోచ్చారు.

నిజానికి గవర్నర్ ను తొలగించలేరని, కానీ తానేదైనా విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవి కోల్పోవాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. అంతేకాదు, ఢిల్లీ నేతలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్న సంగతి తనకు తెలుసన్నారు. పదవిని వదులుకోమని చెబితే కనుక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్లిపోతానని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. ఇంతలా తనను అవేదనకు గురిచేస్తున్నది రైతు ఉద్యమమేనని అన్నారు. రైతులను రోడ్లపైకి వచ్చి ఓ వైపు నిరసనలు చేస్తూన్నా.. మరోవైపు వారు పంటలను కూడా పండిస్తున్నారని, ఇంతటి చిత్తశుద్దితో వ్యవహరిస్తున్న రైతులతో విభేదించి ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని ఆయన అన్నారు.

ఓ కుక్క చనిపోయినా తమ ప్రగాఢ సంతాపం తెలిపే ఢిల్లీ నేతలు సుదీర్ఘంగా సాగుతున్న రైతు ఉద్యమ నిరసనల్లో 600 మంది రైతులు మరణించినా ఆ విషయమే ఎరుగనట్టు ప్రవర్తిస్తున్నారని, లోక్ సభలో వారి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచాన్ని భారత దేశ రైతు ఉధ్యమం అకర్షిస్తోందని.. దీనిని ఎలా పరిష్కారం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొందని కూడా అన్నారు. దానిని పట్టించుకోకపోతే.. నష్టపోయేది పార్టీ అని ఆయన అన్నారు.అలాగే, ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్లాన్‌ను కూడా మాలిక్ విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనానికి బదులు ప్రపంచ స్థాయి కళాశాలను నిర్మిస్తే బాగుంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles