IT seizes Rs 1,000 Crore-Worth Assets of Ajit pawar మహారాష్ట్ర డిఫ్యూటీ సీఎంకు చెందిన రూ.1000 కోట్ల అస్తుల సీజ్

1 000 crore worth assets allegedly linked to maharashtra minister seized

Ajit Pawar, IT raids, Income Tax Raids, Rs 1000 worth assets sieze, beneficiaries, benami properties, Nirmal Tower, Sugar Factory, Maharashtra Deputy Chief Minister, Rs 1000 cr Assets, Goa Resort, Delhi House, Sharad Pawar, income tax, corruption, Benami Transactions, Pawar’s sisters, Kirit Somaiya, Maharashtra, Crime, Politics

Assets worth over ₹ 1,000 crore - allegedly linked to Maharashtra Deputy Chief Minister Ajit Pawar and his family members - have been seized by the Income Tax Department. Five properties, including Nirmal Tower at Mumbai's iconic Nariman Point, have been seized, sources said. A sugar factory and a resort have also been seized.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రికి చెందిన రూ.1000 కోట్ల అస్తుల సీజ్

Posted: 11/02/2021 03:52 PM IST
1 000 crore worth assets allegedly linked to maharashtra minister seized

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబానికి చెందినదిగా అభియోగిస్తూ రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. ఈ ఆస్తులు అజిత్ కుటుంబానికి చెందినవని.. అయితే బినామీ అస్తులుగా వీటిని ప్రకటించినప్పటికీ వాటిని ఆయన కుటుంబమే అనుభవిస్తోందని ఆదాయపన్ను శాఖ అధికారులు పేర్కోన్నారు. దీంతో బినామి వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసిన ఐటీ శాఖ అధికారులు వీటిని అజిత్ పవార్ కుటుంబం అక్రమంగా సంపాదించిందని అభియోగాలను మోపింది.

ఈ బినామి వ్యతిరేక చట్టం కింద అజిత్ కుటుంబానికి చెందిన ఐదు ఆస్తులను తాము సీజ్ చేశామని ఐటీ అధికారులు తెలిపారు. జప్తు చేసిన ఆస్తుల్లో సతారా కేంద్రంగా వున్న జరందేశ్వర్ కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం ఉందని.. దాని విలువే రూ.600 కోట్లు ఉంటుందని ఆదాయ పన్నుశాఖ అధికారులు అంచనా వేశారు. ఇక దక్షిణ ఢిల్లీలోని ఫ్లాట్ ఖరీదు సుమారుగా రూ. 20 కోట్లు, నారిమణ్ లోని నిర్మల్ కార్యాలయం ఖరీదు రూ.25 కోట్లుగా అంచనా వేసిన ఐటీ శాఖ.. గోవాలోని ఆయనకు చెందిన రిసార్టు ఖరీదు రూ.250 కోట్లుగా అంచనావేశారు.  

అక్టోబరులో అజిత్ పవార్ తోబుట్టువులు, సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా... కేంద్రం కావాలనే తమపై దాడులు చేయిస్తోందని అజిత్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా తాము పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని అన్నారు. తనకు చెందిన ఆస్తులను పన్నులు సకాలంలో చెల్లించామని అన్నారు. అయితే తాను దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం తన సోదీరిమణులు తన వల్ల ఐటీ దాడులను ఎదుర్కోవడంపై అవేదన వ్యక్తం చేశానని అన్నారు. కాగా, తాజా ఐటీ దాడులపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య స్పందిస్తూ, జప్తు చేసిన ఆస్తులు అజిత్ పవార్ కుమారుడు, భార్య, తల్లి, సోదరి, అల్లుడి పేరు మీద ఉన్నాయని వివరించారు.

ఇక ఈ ఆస్తుల జప్తుపై ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవర్ స్పందిస్తూ.. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి అతిధుల విషయంలో తాము ఎలాంటి భయాందోళన చెందబోమని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని.. ఇప్పుడు అజిత్ పవార్ విషయంలో ఐటీ అధికారుల చర్యలు కూడా అలాంటివేనని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు చనిపోవడంపై తాము మాట్లాడినందుకు కేంద్రం ఈ తరహా చర్యలకు తెరలేపిందని శరద్ పవార్ అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles