TTD decides to provide darshans to devotees through APSRTC తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..

Ttd decides to provide darshans to devotees through apsrtc online booking system

Tirumala Tirupati Devasthanam, APSRTC online booking system, APSRTC, TTD, darshans, 300 special darshan tickets, TTD, Sri Vari darshanam, Tirumala Darshanam, Lord Balaji darshan, special darshanam tokens, Lord Venkateshwara swamy darshanam, YV SubbaReddy, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, Ailipiri route, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Dharma reddy, devotional

TTD has made it possible for devotees to visit Tirumala through the APSRTC online ticket booking system as most of them are unable to get the tickets for darshans.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..

Posted: 11/02/2021 01:29 PM IST
Ttd decides to provide darshans to devotees through apsrtc online booking system

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం ఇప్పటికే ఎంతో మంది సాధారణ భక్తులు వేచిచూస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ రెండో దశ అన్ లాక్ నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఆంక్షలతో శ్రీవారి దర్శనభాగ్యం సామాన్య భక్తులకు అందకుండా పోయింది. ఆన్ లైన్లో ప్రత్యక దర్శనం సహా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీకాసుల వాడిని దర్శంచుకునే భాగ్యం లభించక చాలా మంది భక్తులు నిరాశకు గురవుతున్నారు. తిరుమలలో అనునిత్యం ఓం నమో నారాయణాయ అనే భక్తుల శరణుఘోషతో ప్రతిధ్వనించే సప్తగిరులు.. మౌనగిరిలుగా మారుతున్నాయన్న విమర్శలు వినిపించాయి.

అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా తగు నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. అయితే టీటీడీ విడుదల చేసిన టికెట్లు హాట్ కుకుల్లా అయిపోతున్నాయి. వేల టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అవుతున్నాయి. అందరూ తమకు వెంకన్న దర్శనం కావాలని టికెట్ల విడుదల సమయం వరకు వేచివుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కలియుగ ప్రత్యక్షదైవం భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్‌ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల కల్పించింది.

ఇందులో భాగంగా  దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం కోసం వచ్చే భక్తులు www.apsrtconline.org.in వెబ్‌సైట్‌లో ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్‌ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్‌ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్‌ వైజర్లు సహాయం చేస్తారు. విజయవాడ, గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌ తదితర 650 ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్‌లైన్‌ విధానంలో టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles