Counting Underway for bypoll to Huzurabad assembly seat వికసించిన ‘కమలం’ ఏడవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల

Counting underway in huzurabad and badvel assembly constituency by election

Etela Rajender, BJP, TRS, Huzurabad, Gellu Srinivas, Dalitha Bandhu, Harish Rao, TRS KCR, Chief Minister K Chandrashekhar Rao, Gellu Srinivas Yadav, Harish Rao, PeddiReddy, Central Election Commission, by-election, Huzurabad by-election, Huzurabad bypoll, Huzurabad, Huzurabad Assembly constituency, Telangana By-Polls, Telangana, Politics

Counting is underway amid tight security in the by-election Counting to the Huzurabad and Badvel Assembly constituencies in Telangana and Andhra Pradesh. In Huzurabad BJP candidate Etela Rajender leads and in Badvel Ruling YSRCP candidate Dasari Padma leads.

హుజూరాబాద్ లో వికసించిన ‘కమలం’ ఏడవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల

Posted: 11/02/2021 11:12 AM IST
Counting underway in huzurabad and badvel assembly constituency by election

తన ఆత్మగౌరవం ముందు ఎలాంటి మంత్రి పదవులు పనిచేయవని, ఉద్యమంలో ఉన్న నేతలను పొమ్మనకుండా పోగబెట్టుతున్న టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కిస్తోందని అరోపిస్తూ మంత్రి పదవికి, ఎమ్మెల్యేకు, పార్టీకీ రాజీనామా చేసిన ఎన్నికలకు వెళ్లిన ఈటెల రాజేందర్ కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన ఆత్మగౌరవం ముందు మంత్రి పదవి తృణప్రాయమన్న ఈటెల అవేదనను అర్థం చేసుకున్న ఓటర్లు ఆయనను దాదాపుగా 24 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

అదికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారం చేసినా.. కోట్ల రూపాయల అభివృద్ది పనులు రోజుల వ్యవధిలో చేపట్టినా.. దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే చేపట్టినా.. అన్ని చేయించుకున్న ఓటర్లు తమ డబ్బుతోనే తాము చేయించుకునే అవకాశం లభించిందన్నట్లుగా తీర్పును వెలువరించారు. దీంతో ఈటెల తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీపై అధిపత్యం కనబరుస్తూ వస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కేవలం రెండు రౌండ్లలో మాత్రమే తన అధిక్యతను కనబర్చారు. ఈటెల ఆత్మగౌరవానికి, బీసి జనుల ఆత్మగౌరవానికి నాందిగా ఈ ఉపఎన్నికలలో ఓటర్లు నిలిచారు

హుజురాబాద్ లో బీజేపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఓటర్లు ఆశీర్వదించడంతో ఆయన ఏకంగా ఏడో పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపోందారు. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారన్న వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉద్యమ పార్టీలో సీనియారిటీకి పగ్గాలు దక్కుతాయా.? లేక వరసత్వానికి పగ్గాలు లబిస్తాయా.? అన్న ప్రశ్నలు ఉతన్నమయ్యాయి. ఈ క్రమంలో ఈ అంశాన్ని చాకచక్యంగా తెరదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని చాటిచెప్పారు. అయితే పార్టీలో తన తర్వాతి స్థానం ఈటెలదేనని తెలంగాణ వాసులు భావిస్తున్న క్రమంలో ఆయనను మంత్రవర్గం నుంచి తప్పించి భూ అక్రమణల వ్యవహరాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

కాగా, ఇలాంటి అరోపణలు ఎదుర్కోంటున్న ఉధ్యోగ సంఘం ఉధ్యమ నేత స్థాయి నుంచి మంత్రిగా ఎధిగిన అమాత్యుడితో పాటు.. తెలంగాణ అవిర్భవించిన తరువాత పరాయి పార్టీ నుంచి గోడ దూకి వచ్చిన మరో అమాత్యుడిపై కూడా ఇలాంటి అరోపణలే వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఈటెల తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో ఈటల సెంటిమెంట్ ముందు టీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు పనిచేయలేదు.

ఇదిలావుండగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ ఎన్నికలలో రెండు రౌండ్లలో మాత్రమే ఈటెలపై అధిపత్యం సాధించారు. ఇక దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ లోనూ అధిపత్యం ప్రదర్శించాడు. ఇంతవరకు బాగానే వున్నా.. ఆయనకు ఈ ఎన్నికలలో విచిత్రమైన పరిస్థితిని చవిచూశారు. ఆయన తన స్వగ్రామంలోనూ, అత్తగారి ఊర్లోనూ ఆధిక్యం పొందలేకపోయారు. సొంతూరు హిమ్మత్ నగర్ లో గెల్లుకు 358 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఈటల రాజేందర్ కు 549 ఓట్లు వచ్చాయి. అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెలోనూ ఇదే పరిస్థితి! ఇక్కడ గెల్లు కంటే ఈటలకు 76 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

* ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సంపాదించింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్ కు 503 ఓట్లు, బీజేపీకి 159 ఓట్లు, కాంగ్రెస్ కు 35 ఓట్లు పోలయ్యాయి. 14 ఓట్లు చెల్లకుండా పోయాయి.

* తొలి రౌండ్ లో ఈటల రాజేందర్ కు 4,610 ఓట్లు పోలవ్వగా... టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 4,444 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 119 ఓట్లు పడ్డాయి. తొలి రౌండ్ లో ఈటలకు 166 ఓట్ల ఆధిక్యం లభించింది.

* రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కు 4,659 ఓట్లు రాగా... ఈటలకు 4,851 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 220 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్ లో ఈటల 193 ఓట్ల ఆధిక్యతను సాధించారు. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల 359 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

* మూడో రౌండ్ లో 906 ఓట్ల లీడ్ ఈటల సాధించారు. ఈ మూడు రౌండ్లలో కలిపి 1,273 ఓట్ల మెజార్టీలో ఈటల కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ కు బలమైన పట్టు ఉన్న హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో కూడా బీజేపీ లీడ్ సాధించడం టీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.

* నాలుగో రౌండ్ లో ఈటెలకు భారీ ఆధిక్యం లభించింది. ఏకంగా 1,695 ఓట్ల మెజారిటీ పొందారు. మొత్తంగా ఈటలకు 2,958 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగు రౌండ్లు కలిపి ఈటలకు 17,838 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 16,134 ఓట్లు వచ్చాయి.  

* ఐదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెలకు 4,435 ఓట్లు లభించగా, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు 4014 ఓట్లు పోల‌య్యాయి. కాంగ్రెస్‌కు 132 ఓట్లు పోల‌య్యాయి. ఐదో రౌండ్‌లో బీజేపీకి 344 లీడ్ రాగా, ఐదు రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 2,169 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* అరో రౌండ్ లో అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ 1017 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్‌లో బీజేపీకి 4,656 ఓట్లు ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 3,639 వ‌చ్చాయి. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌కు కేవ‌లం 180 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

* ఎనిమిదవ  రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 162 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు 4,248 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 4,086 ఓట్లు, కాంగ్రెస్‌కు 89 ఓట్లు పోల‌య్యాయి. దీంతో ఎనిమిది రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 3,270 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెలకు 5,305 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 3,470 ఓట్లు, కాంగ్రెస్‌కు 174 ఓట్లు పోల‌య్యాయి. దీంతో
తొమ్మిది రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 5,105 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* ప‌దో రౌండ్‌లో ఈటెల రాజేందర్ కు 4,295 ఓట్లు లభించగా, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 3,709 ఓట్లు పోల‌వ్వ‌గా, కాంగ్రెస్‌కు 118 ఓట్లు పోల‌య్యాయి. ప‌దవ రౌండ్ పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 5,691 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* పదకొండవ రౌండ్‌లో టీఆర్ఎస్ మ‌ళ్లీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. ఈట‌ల రాజేంద‌ర్‌పై, గెల్లు శ్రీ‌నివాస్ 367 ఓట్ల‌తో ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4,326 ఓట్లు వ‌చ్చాయి.

* ప‌న్నెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటెలకు 4,849 ఓట్లు పోల‌వ్వ‌గా, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 3,632 ఓట్లు, కాంగ్రెస్‌కు 158 ఓట్లు పోల‌య్యాయి. ప‌న్నెండు రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 6,523 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* పదమూడవ రౌండ్లో బీజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మళ్లీ ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. ఆయనకు ఈ రౌండ్ లో 4,836 ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కు 2,971 ఓట్లు పోల‌వ్వ‌గా, కాంగ్రెస్‌కు 101 ఓట్లు పోల‌య్యాయి. 13వ రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 8,388 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* పద్నాల్గవ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ 1046 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో బీజేపీకి 4346 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 3700 ఓట్లు వ‌చ్చాయి.

* పదిహేనవ వ‌ రౌండ్‌లో బీజేపి అభ్యర్థి ఈటెల ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌పై 2049 ఓట్ల మెజారిటీ సంపాదించారు. ఈ రౌండ్లో బీజేపికి 5407 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ కు 3,358 ఓట్లు, కాంగ్రెస్‌కు 149 ఓట్లు పోల‌య్యాయి.

* పదహారవ‌ రౌండ్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కు 1742 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండ్లో బీజేపీకి 5689 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్‌కు 3977 ఓట్లు వ‌చ్చాయి. మొత్తానికి 13,195 ఓట్ల‌ మెజార్టీతో బీజేపీ మొద‌టిస్థానంలో కొనసాగుతుంది.

* పదహేడవ‌ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 4,187 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 5,610 ఓట్లు, కాంగ్రెస్‌కు 203 ఓట్లు పోల‌య్యాయి. పదహేడవ‌ రౌండ్లు పూర్త‌య్యేస‌రికి ఈట‌ల రాజేంద‌ర్ 14,618 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు.

* పద్దెనిమిదవ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ 1876 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్లో బీజేపీకి 5611 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్‌కు 3735 ఓట్లు వ‌చ్చాయి. మొత్తానికి 16,494 ఓట్ల‌ మెజార్టీతో బీజేపీ మొద‌టిస్థానంలో ఉంది.

* పంతొమ్మిదవ రౌండ్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ 3047 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండ్లో బీజేపీకి 5916 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్‌కు 2869 ఓట్లు వ‌చ్చాయి. మొత్తానికి 19,541 ఓట్ల‌ మెజార్టీతో బీజేపీ మొద‌టిస్థానంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  BJP  TRS  Huzurabad  Gellu Srinivas  Dalitha Bandhu  Harish Rao  Telangana  AP  Politics  

Other Articles