Watching TV to get expensive from December 1 టీవీ వీక్షణ చార్జీలను అమాంతం పెంచేసిన ట్రాయ్.!

Watching tv to get expensive from december 1 by up to 50 per cent

TV, DTH, Trai, broadcasting networks, Zee, Star, Sony, Viacom18, New Tariff Order (NTO), Star Plus, Colors, Zee TV, Sony

The prices of petrol and diesel are already burning the pocket of people and now, watching TV is going to be an expensive affair. The prices of TV channels are going to increase from December 1 as the country's leading broadcasting networks Zee, Star, Sony and Viacom18 have excluded some channels from their bouquet, or the pack of channels.

టీవీ చూసే అలవాటుందా.? అయితే మీ జేబుకు చిల్లు పడినట్లే.!

Posted: 10/20/2021 08:51 PM IST
Watching tv to get expensive from december 1 by up to 50 per cent

పెట్రోల్, డీజిల్, సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ వాహనదారుల జేబులకు చిల్లుపెట్టిన కేంద్రం.. ఇక నుంచి ఇంట్లో కూర్చుని హాయిగా టీవీని వీక్షించే అవకాశాన్ని కూడా సామాన్యులకు ప్రియంగా మార్చనుంది. ఇప్పుడు టీవీల వంతు వచ్చింది. ఇకపై టీవీ చూడటం ఖరీదైన వ్యవహారంగా మారనున్నది. దేశంలోని ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లు జీ, స్టార్, సోనీ, వయాకామ్ 18.. కొన్ని ఛానళ్లను తమ ప్యాక్ నుంచి మినహాయించినందున.. టీవీ ఛానళ్ల ధరలు డిసెంబర్ 1 నుండి పెరగబోతున్నాయి. ఈ పెంపుదల 50 శాతం వరకు ఉండనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) కొత్త టారిఫ్ ఆర్డర్ కారణంగా బ్రాడ్‌కాస్టర్లు వారి ధరలను పెంచేశారు.

దేశంలో బ్రాడ్‌కాస్టింగ్, మొబైల్ సేవలను నియంత్రించే అధికారం ఉన్న ట్రాయ్‌.. 2017 మార్చిలో టీవీ ఛానళ్ల ధరలకు సంబంధించి కొత్త టారిఫ్ ఆర్డర్‌ జారీ చేసింది. అయితే, ఈ కొత్త టారిఫ్‌ ఆర్డర్‌తో కొన్ని సమస్యలు ముందుకు వచ్చాయి. దాంతో 2020 జనవరి 1 సవరించిన టారిఫ్ ఆర్డర్ మరోసారి జారీ చేశారు. దీనిని ఎన్‌టీఓ 2.0 అని పిలిచారు. ఈ ఎన్‌టీఓ 2.0 లో బొకెట్‌లోని ఒక్కో ఛానల్ కనీస ధరను రూ.12 గా ట్రాయ్‌ ఆదేశించింది. ఇంతకు ముందు, ఇది నెలకు రూ.15-25 మధ్య ఉండేది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఛానళ్లు తక్కువ ధరలకే బొకెట్లను అందించాయి.

కొత్త టారిఫ్‌ విధానం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానుండటంతో ప్రముఖ టీవీ ఛానళ్లను వీక్షించే ధర పెరగనున్నది. స్టార్ ప్లస్, కలర్స్, జీ టీవీ, సోనీతోపాటు కొన్ని ప్రాంతీయ ఛానళ్లను చూసేందుకు వీక్షకులు 35 నుంచి 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. స్టార్, డిస్నీ ఇండియా ఛానళ్లను చూడాలంటే డిసెంబర్‌ నుంచి ప్రతి నెలా రూ.49 కి బదులుగా రూ.69 ఖర్చు చేయాల్సి ఉంటుంది. సోనీ కోసం నెలకు రూ.39 కి బదులుగా రూ.71, జీ టీవీకి రూ.39 కి బదులుగా రూ.49. వయాకామ్ 18 ఛానల్‌లకు రూ.25 కి బదులుగా రూ.39 చెల్లించాల్సి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV  DTH  Trai  broadcasting networks  Zee  Star  Sony  Viacom18  New Tariff Order (NTO)  Star Plus  Colors  Zee TV  Sony  

Other Articles