Gun toddler used to shoot Florida mom on Zoom call తల్లి తలలో తుపాకీతో షూట్ చేసిన రెండేళ్ల చిన్నారి..

Gun toddler used to shoot florida mom on zoom call was in paw patrol backpack

florida toddler Killed Mom on Zoom, Toddler Shoots Mom, florida toddler gun shoot, toddler shoot mom in head, Veondre Avery, Shamaya Lynn, Zoom call, office colleagues, toddler, gun, gun shoot mother, work from Home, Florida court, America, U.S. crime

A man accused of leaving a handgun where a toddler could not only get to it, but use it, was in court. A 21-year-old mother of two was shot in the head and killed in August, shot by her 2-year-old after he found the unsecured gun.

జూమ్ కాల్ లో తల్లి.. తుపాకీతో తలలో షూట్ చేసిన రెండేళ్ల చిన్నారి..

Posted: 10/14/2021 01:35 PM IST
Gun toddler used to shoot florida mom on zoom call was in paw patrol backpack

కరోనా మహమ్మారి విరుచుకుపడి లక్షలాది మంది ప్రాణాలను హరించిన కోట్లాది మందిపై ప్రభావం చాటిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటిు, ఎంఎన్సీ, చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీంతో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉద్యోగులు తమ విధులను హాజరై పనులు చేసుకుంటున్నారు. అయితే ఇలానే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన షమాయా లిన్ అనే మహిళ కూడా తాను పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో ఇంటి నుంచే ఆమె పని చేస్తోన్న అమె తన ఆఫీసు సహుద్యోగులతో జూమ్‌ కాల్‌ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె రెండేళ్ల కుమారుడు వెనగ్గా వచ్చాడు. అతనికి ఒక బ్యాగులో లోడ్ చేసిన తుపాకీ దొరికింది. దానిని పట్టుకుని వచ్చి నేరుగా తన తల్లి తలలో షూట్ చేసేశాడు. దీంతో షమాయా లిన్ కాల్ మాట్లాడుతుండగానే కుప్పకూలింది. అమె ముందుకు పడటాన్ని గమనించిన సహోద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కానీ షమాయా అడ్రస్ ఆ ఉద్యోగినికి తెలియదు.

కాగా అదే సమయంలో షమాయా భర్త వియాండ్రే ఆవరీ కూడా తన భర్య రక్తపు మడుగులో పడిఉందని పోలీసులకు ఫోన్ చేశాడు. తాను ఇంటికొచ్చే సరికే షమాయా తన కంప్యూటర్‌ ముందు కుప్పకూలి ఉందని, రక్తపు మడుగు పడిఉందని ఆవరీ చెప్పాడు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే షమాయా మృతిచెందింది. ఈ ఘటన ఆగస్టు నెలలో చోటుచేసుకోగా ఇవాళ ఈ కేసును ఫ్లోరిడా న్యాయస్థానవం విచారించింది. ఈ  సందర్భంగా తుపాకీని నిర్లక్ష్యంగా బ్యాక్ ప్యాక్ లో వదిలేసినందుకు ఆవరీని దోషిగా తేల్చిన న్యాయస్థానం అయనకు శిక్షను విధించనుంది.

కాగా అవరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను తుపాకీని చిన్నారులు చేరుకుని.. దానిని వినియోగించేందుకు వీలుగా అన్ లాక్ చేయడాన్ని అవరీ తప్పుగానే న్యాయస్థానం పేర్కోంది. అలా వదిలేయడం వల్లే రెండేళ్ల పసివాడికి ఆ తుపాకీ దొరికిందని, అతను తల్లిని షూట్ చేశాడని పోలీసులు అంటున్నారు. కాగా అగ్రరాజ్యంలో విచ్చలవిడిగా వినియోగించేలా తుపాకీ సంస్కృతి రాజ్యమేలడంతోనే ఈ దారుణ ఘటన జరిగిందన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles