Railways charging higher fares for Special Train Tickets పండగ వేళ.. ప్రత్యేకం పేరుతో రైల్వే బాదుడు..!

Railways charging higher fares for special train tickets

Indian Railways, train fare increased, Railways, coronavirus cases surge, Covid19, Festive season, Ticket fares hiked, railway special trains, SCR

Railways which are been charging heavily since the NDA period comes in to rule, which is been much more during corona season and increased much more amid dussera and diwali festive season for Special Trains.

పండగ వేళ రైల్వే బాదుడు..! ప్రత్యేకం పేరుతో భారీ వడ్డింపు.!!

Posted: 10/09/2021 12:10 PM IST
Railways charging higher fares for special train tickets

పండుగ పర్వదినాలలో సకుటుంబసపరివారి సమేతంగా సామాన్యులు పండుగను జరుపుకునేలా.. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా తాము ప్రత్యేక రైళ్లును పరుగులు పెట్టిస్తామన్న రైల్వేశాఖ సంతోషకరమైన వార్తను అందించింది. అయితే అదే సమయంలో ఈ సంతోషాన్ని ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక బాదుడు వుంటుందని తెలియజేసింది. దీంతో సోంత ఊళ్లకు వెళ్లి పండుగ వేడుకల్లో పాల్గోనాలన్న సామాన్యుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేశాఖ ప్రయాణికులపై ఎనలేని భారం మోపుతోంది.

ప్రత్యేక రైళ్లు, తత్కాల్ పేరుతో ప్రయాణికులు భరించలేనంతగా చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వే తాజా నిర్ణయంతో రైలు, ప్రయాణం చేసే క్లాస్‌ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ. 200 నుంచి రూ. 700 వరకు భారం పడుతోంది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. దీంతో అనూహ్యంగా పెరిగిన రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ రైళ్ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఈ నెల 14న హైదరాబాద్-విశాఖపట్టణం గరీభ్ రథ్ రైలు టికెట్లన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడుపోగా, 142 మంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు 16 రైళ్లు వెళ్లనుండగా రెండు, మూడు మినహా అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి. దీంతో కొందరు అనేక వ్యయప్రయాసలు పడైనా వెళ్లాల్సింేద అనుకుంటుండగా, మరికోందరు మాత్రం పరిగెత్తి పాలు తాగడం కంటే.. నిలబడి నీళ్లు తాగడం ఎంతో మేలంటూ.. ఉన్నచోట పండుగ సంబరాలు చేసుకుందామని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles