Cyclone Shaheen: Coast Guard on high alert కోస్తా ప్రాంతానికి తుఫాను హెచ్చరిక... తెలంగాణకు వర్ష సూచన

Cyclone shaheen to emerge off gujarat coast by friday morning headed to pakistan

IMD forecast, low depression, intensify into cyclone, north arabia sea, Cyclone Shaheen, Heavy rainfall, coast guard, Gujarat, Arabian Sea, Cyclone Tauktae, cyclone Gulab, Weather forecast, depression in Arabian Sea, Rainfall in Gujarat, Heavy Rain in Gujarat, weather, skymet, Weather forecast

The Indian Coast Guard on Wednesday raised warnings for fishermen to return to harbour amid reports of cyclonic built up in the Arabian Sea. The Coast Guard Headquarters at Porbandar, Okha and stations in Gujarat has been put on high alert and on standby as the Indian Meteorological Department (IMD) warned that Cyclone Gulab could re-intensify as Cyclone Shaheen in the next 24-hours.

అరేబియా సముద్రంలో మరో తుపాను.. శుక్రవారం ఉదయం తీరం ధాటే అవకాశం

Posted: 09/29/2021 04:00 PM IST
Cyclone shaheen to emerge off gujarat coast by friday morning headed to pakistan

ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాల ప్రజల జనజీవనాన్ని స్థంభింపజేసిన వరుణుడు ఈ రాష్ట్రాలపై గులాబ్ తుఫానుతో విరుచుకుపడగా, తాజాగా ఈ తుఫాను ప్రభావం సన్నగిల్లి అల్పపీడనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇది మరింత బలపడి మరో తుపానుగా భారత్ దేశంపై విరుచుకుపడే అవకాశాలు వున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్న గంటల వ్యవధిలో వాయుగుండగా మారనుంది. ఇది మరింత బలపడి షహీన్ తుపానుగా మారునందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు మత్స్యకారులను వెంటనే తీరప్రాంతానికి రావాలని కూడా సూచనలు చేశారు.

గులాబ్ తుపాను తన ప్రభావం తగ్గడంతో నిన్నటి నుంచి వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. కాగా, ప్రస్తుతం సైక్లోన్ గులాబ్ మరఠ్వాడా, విదర్భల్లో కేంద్రీకృతమైందని అధికారులు అంటున్నారు. అయితే, సైక్లోన్ గులాబ్ పోతూపోతూ మరింత ఉగ్రరూపం దాలుస్తోందట. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్.. ఇప్పుడు అరేబియాలో మరో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతోందట. ‘సైక్లోన్ షహీన్’గా మారుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాని ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ప్రస్తుతం విదర్భ వద్ద అరేబియాలో వాయుగుండం కొనసాగుతోందని, రేపటికి తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో తేమ ఎక్కువగా ఉందని, సైక్లోన్ గులాబ్ బలహీనపడినా ఆ తేమ వల్లే తిరిగి శక్తి పుంజుకుంటోందని అంటున్నారు. సముద్రాన్ని చేరేకొద్దీ ఆ తేమతో తుపాను శక్తి పెరుగుతుందని కోల్ కతా ప్రాంతీయ వాతావరణ కేంద్ర సంచాలకుడు డాక్టర్ జి.కె. దాస్ చెప్పారు. ఈ ఏడాది రుతుపవనాల తిరోగమనం ఆలస్యమవుతోందని, దాని వల్ల వాతావరణంలో తేమ ఎక్కువ అవుతోందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles