గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా గూగుల్ క్రోమ్ ను విపరీతంగా వాడే యూజర్లకు భద్రత విషయంలో ఊరట కల్పించింది. గూగుల్ క్రోమ్ లోని బగ్స్ ను కనుగొని ఏకంగా నూతన క్రోమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. అంతేకాదు తమ యూజర్లను ప్లేస్టోర్ లోకి వెళ్లి తాజా అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్-94 అప్ డేట్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలోనే ఈ కోత్త అప్ డేట్ వర్షన్ ను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది.
గూగుల్ యూజర్లు అందరూ అప్ డేట్ వర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ క్రోమ్ తాజా అప్ డేట్ వర్షన్ ను అండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్ ఓఎస్ తో పాటుగా లింక్స్ వర్షన్ లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గూగుల్ సంస్థ పేర్కోంది. ప్రైవసీతో పాటు కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ను అందిస్తూనే క్రోమ్-94.. తాజా వర్షన్ లో ఏకంగా 32 బగ్స్ ను సైతం ఫిక్స్ చేసిందని సంస్థ వెల్లడించింది. ఈ వర్షన్ 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం సమర్థవంతంగా ఎదుర్కోంటుందని తెలిపింది.
ఇక తమ తాజా వర్షన్ తో కాపి లింక్స్, క్యూఆర్ కోడ్ లను వైబ్ సైట్లతో పంచుకునేందుకు కూడా పూర్తి సురక్షితమైన హబ్ గా క్రోమ్ కొత్త వర్షన్ నిలువనుందని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఇది తమ హెచ్టిటిపిఎస్-ఫస్ట్ మోడ్ కి సంబంధించిన వర్షన్ అని ప్రకటించింది. దీంతో సురక్షిత రహితమైన వెబ్ సైట్లును ఓపెన్ చేసేముందు ఇన్నాళ్లు చిన్నగా కనిపించే క్రోమ్ హెచ్చరిక ఇకపై ఫుల్ పేజ్ లో కనిపిస్తుందని తెలిపింది. దీంతో యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ పేర్కోంది. ఓవైపు సేఫ్ బ్రౌజింగ్, వెబ్‌కోడెక్స్ ద్వారా మానిటర్, ఇతర స్క్రీన్‌లపై వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్ వేర్ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more