Charanjit Singh Channi Takes Oath as Punjab CM పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ ప్రమాణం..

Charanjit singh channi takes oath as punjab cm

Punjab Chief Minister, Charanjit Singh Channi, swearing-in ceremony, Punjab Bhawan, Rahul Gandhi, Punjab PCC Navjot Singh Sidhu, Punjab affiars incharge Harish Rawath, Congress, Punjab, Politics

Charanjit Singh Channi took oath as the Chief Minister of Punjab on Monday, 20 September, at a ceremony held at Chandigarh's Punjab Bhawan. Congress leader Rahul Gandhi and President of Punjab PCC Navjot Singh Sidhu were also present at the oath-taking ceremony, as was the party's state in-charge Harish Rawat.

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ ప్రమాణం..

Posted: 09/20/2021 01:41 PM IST
Charanjit singh channi takes oath as punjab cm

పంజాబ్‌ కాంగ్రెస్ లో కెప్టెన్ అమరేందర్ సింగ్ వర్గానికి నవజ్యోత్ సింగ్ సిద్దూ వర్గానికి మధ్య రాజుకున్న కుంపటి నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి కారణమైంది. తనపై నమ్మకం లేని చోట తాను ఉండలేనంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్. వెళ్తే వెళ్తూ నవజ్యోత్ సింగ్ సిద్దూపై చేసిన అరోపణలను కాంగ్రెస్ అధిష్టానం లైట్ గా తీసుకుంది. అంతేకాదు ఆయన సూచనల మేరకు ముఖ్యమంత్రి మార్పుకు శ్రీకారం చుట్టింది. సిద్దూను నూటికి నూరుపాళ్లు వెనకేసుకురావడమే కాదు.. ఆయనకే పంజాబ్ లో ప్రణాళికలను అప్పజెప్పింది.

ఆ ప్రణాళికల్లో భాగంగానే పంజాబ్ లో నూతనాధ్యాయం లిఖించింది. దీంతో ఇవాళ పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. ఛరన్ జీత్ సింగ్ తో రాజ్ భవన్ లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చన్నీ నిలిచారు. కాగా, రెండు రోజుల క్రితం సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్‌ కొత్త సీఎంగా చన్నీని కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో ఆయన ఇవాళ ప్రమాణం చేశారు.

పంజాబ్‌లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. చన్నీ మాల్వా బెల్డ్ లో రూప్ నగర్‌ జిల్లాలోని చామ్ కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దళితులు పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles