Truck parts continue to roll on road after accident ‘దేహాన్ని వదిలి ఆత్మ పరుగు పెట్టిందిలా’.. ట్రక్కు ఫన్నీ వీడియో.!

Truck parts continue to roll on road after accident in viral video

truck accident truck parts, truck, truck accident, truck viral video, truck accident video, funny truck video, Viral video, video viral, viral video 2021

A video of truck parts rolling on the road after the vehicle met with an accident has left social media users in splits. The 14-second clip shows two men walking on a road as a truck approaches them after taking a turn. The men run out of the frame as the truck dismantles soon after taking the turn. Some of the damaged truck's parts continue to roll on the road as the truck driver gets up and runs after them.

ITEMVIDEOS: ‘దేహాన్ని వదిలి ఆత్మ పరుగు పెట్టిందిలా’.. ట్రక్కు ఫన్నీ వీడియో.!

Posted: 09/16/2021 06:59 PM IST
Truck parts continue to roll on road after accident in viral video

రోడ్ల మీద ప్ర‌మాదాలు సాధార‌ణ‌మే. ఒక్కోసారి వేరే వాహ‌నం వ‌చ్చి మ‌రో వాహ‌నాన్ని ఢీకొడుతుంది. అలా కాకుండా.. కొన్ని వాహ‌నాలు ఓవ‌ర్ స్పీడ్ వ‌ల్ల‌… డ్రైవ‌ర్ అజాగ్ర‌త్త వ‌ల్ల వాటిక‌వే ప్ర‌మాదానికి గుర‌వుతుంటాయి. ఇక మరికొన్ని ప్రమాదాలకు ఓవర్ లోడ్ కు తోడు గతుకుల రోడ్లు కూడా కారణం కావచ్చు. అయితే ఇలాంటి రోడ్లపై భారీ వాహనాన్ని నడపాలంటే అనుభవం ఎంతో ముఖ్యం. అయితే ఎంత అనుభవం వున్నా.. ట్రక్కు నిర్వహణ సరిగ్గా లేనప్పుడు కూడా ప్రమాదాలు జరిగే అస్కారం వుంటుంది.

ఇప్పుడు మీరు చూడ‌బోయే వీడ‌యోలో ట్ర‌క్ ప్రమాదానికి గురైంది. అందుకు ఓవర్ లోడ్, గతుకుల రోడ్డు, అనుభవరాహిత్యం, ట్రాక్కు నిర్వహణ అన్ని కారణమనే చెప్పాలి. అదెలా అంటే సరిగ్గా మలుపులో ఓవర్ లోడ్డుతో వెళ్లడం... అందులోనూ గతుకుల రోడ్డు కావడంతో కాసింత నిదానంగా నడిపితే ప్రమాదం జరిగేదే కాదన్న వాదనలు వినిబడుతున్నాయి. అయితే అదే అనుభవరాహిత్యం. సరిగ్గా మలుపు వద్ద ట్రక్కు ఒక వైపు ఒరిగింది. అలాగే కింద ప‌డిపోయింది. ట్ర‌క్ బాడీ పార్ట్స్ మొత్తం కింద ప‌డిపోగా.. టైర్ల‌తో ఉన్న చెస్సీ ఇంజన్ భాగం మాత్రం అలాగే ముందుకు వెళ్లిపోయింది.

రోడ్డు మీద అలాగే.. ట్ర‌క్ టైర్ల పార్ట్ వెళ్లిపోతుండ‌టంతో.. ఆ ట్ర‌క్ డ్రైవ‌ర్ వెంట‌నే లేచి.. దాని వెనుక ప‌రిగెత్తాడు. ఈ వీడియో.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. దీంతో దీనిని నెట్టింట్లో పోస్టు చేసిన నెటిజన్ దేహాన్ని త్యాగం చేసి ఆత్మ వెళ్లిపోతోందని ఫన్ని కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ఈ వైర‌ల్‌ వీడియోపై వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ వీడియోను చూసి.. అయ్యో.. అదే రోడ్డుపై వచ్చే పరిస్థితి ఏంటీ అని అలోచించే వాళ్ల క‌న్నా.. ఫన్నీ ఘటనగా చూస్తూ న‌వ్వుకున్న వాళ్లే అధికం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles