There’s no respect for Supreme Court judgments, CJI tells Centre కేంద్రంపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ మండిపాటు

There s no respect for supreme court judgments cji tells centre

Tribunals Reforms Act, Tribunals Appointment, Supreme court, Chief Justice, NV Ramana, National news

Taking a strong exception to the enactment of the Tribunals Reforms Act that reduced the tenure of chairmen and members of various tribunals, the Supreme Court on Monday said its judgments were not being respected by the government.

‘‘సుప్రీంకోర్టంటే గౌరవం లేదా.?’’ కేంద్రంపై చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ మండిపాటు

Posted: 09/06/2021 08:43 PM IST
There s no respect for supreme court judgments cji tells centre

ట్రైబ్యునల్స్ లో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేనట్టుందంటూ చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కోర్టు సహనాన్ని పరీక్షిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో జడ్జిలను నియమిస్తున్నప్పుడు ట్రైబ్యునల్స్‌లో ఎందుకు భర్తీ చేయరంటూ ప్రశ్నించారు. వారం రోజుల్లోగా ట్రైబ్యునల్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వివిధ ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో 240 ఖాళీల భర్తీపై పిటిషన్లను ఎన్వీ రమణ నేతృత్వంలోని, జస్టిస్ చండ్రచూద్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన స్పెషల్ బెంచ్ విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ కొనసాగాలని కోరుకోవడం లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్‌సీఎల్‌టీ‌, ఎన్‌సీఎల్‌ఏటీ వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయని ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనని తెలిపింది. వీటితో పాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. దీని వల్ల అనేక కేసుల్లో పరిష్కారం లభించక వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తోందని కోర్టు వెల్లడించింది.

దీనికి కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని తెలిపారు. దీంతో కోర్టు అసహనం వ్యక్తంచేసింది. గత రెండేళ్ల నుంచి ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఉన్నాయని ఇప్పటివరకు ఒక్క నియామకం కూడా చేపట్టలేదని మండిపడింది. నియమాకాలు చేపట్టకుండా ట్రైబ్యునళ్లను బలహీన పరుస్తున్నారని పేర్కొంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఇది చాలా విచారకరమని వెల్లడించిందవి. తాము కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవట్లేదు. .కానీ కేంద్రం తమ సహనాన్ని పరీక్షిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ వ్యవహారంలో తమ వద్ద కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. కేంద్రం తెచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం, ట్రైబ్యునళ్లను రద్దు చేసి హైకోర్టులకు అధికారాలివ్వడం, కోర్టు స్వయంగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టడం.. వీటితో పాటు కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే ఆప్షన్‌ను కూడా పరిగణించాల్సి వస్తుందని సీజేఐ హెచ్చరించారు. ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టేందుకు వారం గడువు కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles