Triangular love story solved out with lottery పెద్దలు పరిష్కరించిన ట్రైయాంగులర్ లవ్.. ఆ వెంటనే కళ్యాణం..

Karnataka hassan boy triangular love story solved out with lottery

triangle love story, love story, love toss, Young woman, The triangle love myth, marriage, Sakleshpur, kapala moksha, hassan, different story, love triangle love story, Lotery Love Story, Hassan Lovers, Toss, Karnataka Lovers, karnataka Triangular love story, social media, viral video, Karnataka

The village panchayat has settled the issue of Triangular love in a different way. They saved the village boy who secretly had an love affair with two girls of karnataka, in a lottery system. prior to this the aggrement was made with the girls that they are not going to complain on the issue to Police.

ITEMVIDEOS: పెద్దలు పరిష్కరించిన ట్రైయాంగులర్ లవ్.. ఆ వెంటనే కళ్యాణం..

Posted: 09/06/2021 05:52 PM IST
Karnataka hassan boy triangular love story solved out with lottery

ఈ మధ్యకాలంలో అన్ లైన్ ప్రేమలు ఎక్కువయ్యాయి. అంటే వధువు ఇక్కడ, వరుడు అక్కడ.. పండితుడు మరెక్కడో వున్నా.. అన్ లైన్ ద్వారా పెళ్లీళ్లు జరిగినట్టు కాదు. ఎక్కడ వున్నా అమ్మాయిలను మోసం చేయాలన ఆలోచన మాత్రం మంచిది కాదు. అయితే విప్లవాత్మక మార్పులతో.. అందివచ్చిన సాంకేతికతతో ఇంటర్నెట్ ఏకంగా ప్రతీ మనిషి జేబుల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఇక దాని వినియోగించుకున్న వారికి వినెయోగింరుకున్నట్లు అన్న చందంగా మారింది. దీంతో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు ఏకకాలంలో ఇద్దరు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు.

అతడి మాటల మాయో లేక కల్లబోల్లి చేష్టల మహిమో తెలియదు కానీ ఆ ఇద్దరమ్మాయిలకు అతడంటే అమితమైన ప్రేమ ఏర్పడింది. దీంతో పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని ఆ ఇద్దరు యువతులు గ్రామానికి చేరుకోగా యువకుడి బాగోతం బయటపడింది. తనను పెళ్లి చేసుకోవాలంటే తనను చేసుకోవాలంటూ ఇద్దరూ భీష్మించడంతో విషయం గ్రామ పెద్దల దృష్టికి చేరింది. అబ్బే భలే ఇబ్బంది వచ్చి పడిందే అంటూనే గ్రామస్థులు విభిన్నమైన పద్దతిలో ఈ సమస్యను పరిష్కరించారు. అదెలా అంటే ఇద్దరు నాయకులకు సమాన ఓట్ల వస్తే ఏ పద్దతిలో అయితే విజేతను ప్రకటిస్తారో అదే తరహాలో పెళ్లికి ఒక అమ్మాయిని ఎంపిక చేసి వివాహం జరిపించారు.

కర్ణాటకలోని హసన్ జిల్లాలోని సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇంటర్నెట్ సాయంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు.  ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకోవాలని యువతులిద్దరూ భావించి గ్రామానికి వచ్చారు. దీంతో యువకుడు తనను కాకుండా మరొకరిని ప్రేమిస్తున్న విషయం యువతులు ఇద్దరికీ తెలిసింది. దీంతో ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న సమస్య గ్రామ పెద్దల ముందుకు చేరింది. మరోవైపు, అతడు లేకుంటే తాను బతకలేనంటూ ఓ యువతి విషం తాగింది. దీంతో గ్రామస్థులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కోలుకున్న ఆమె తాజాగా మరోమారు గ్రామానికి వచ్చింది. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.

దీంతో బాగా ఆలోచించిన గ్రామ పెద్దలు ఓ మార్గాన్ని కనిపెట్టారు. ఇద్దరి పేర్లను లాటరీ తీసి ఎవరి పేరు వస్తే వారే అతడిని పెళ్లి చేసుకోవాలని, పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని షరతు విధించారు. ఇందుకు యువతులిద్దరూ అంగీకరించారు. ఇక లాటరీ తీయగా విషం తాగి ఆసుపత్రి పాలైన యువతి పేరు వచ్చింది. దీంతో శుక్రవారం ఆమెతో యువకుడి వివాహం జరిపించారు. మరోవైపు, లాటరీలో ఓడిపోయిన యువతి వారికి శుభాకాంక్షలు చెబుతూనే, తనను మోసం చేసిన ప్రియుడిని వదిలిపెట్టబోనని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ముక్కోణపు ప్రేమ కథ గురించి గ్రామస్థులు తాజాగా వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles