Biden warns Kabul airport attackers: ‘We will hunt you down’ ప్రతీకారం తీర్చుకుంటామని జో బైడెన్ హెచ్చరికలు

Kabul bombings we will hunt you down biden warns attackers

Joe Biden, American President, US, Taliban, Afghanistan Crisis, Pentagon, Kabul, Afghanistan, Kabul airport, ISIS-K, Afghanistan-Taliban Crisis, afghan spies, afghanistan crisis, indians in afghanistan, Kabul, Kabul Airport, hindus in afghanistan

President Joe Biden vowed to complete the evacuation of American citizens and others from Afghanistan despite the deadly suicide bomb attack at the Kabul airport. He also promised to avenge the deaths, declaring to the extremists responsible: “We will hunt you down and make you pay.”

పేలుళ్లపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు

Posted: 08/27/2021 02:46 PM IST
Kabul bombings we will hunt you down biden warns attackers

కాబూల్‌ విమానాశ్రయంలో పేలుళ్లు జరిపి అమాయక ప్రజలతో పాటు అమెరికా బలగాలను బలిగొన్న వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు జారీచేసింది. తాలిబన్ల వశమైన అప్ఘనిస్తాన్ లో ఉండలేక.. అస్తిపాస్తులు వదిలి కట్టుబట్టలతో.. పిల్లాపాపలతో విదేశాలకు చేరుకునేందుకు కాబుల్ విమానాశ్రయానికి చేరిన అమాయక ప్రజలపై బాంబు పేలుళ్లు జరిపి వారిని బలిగొన్నవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు.

ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్‌ఐఎస్‌ నాయకులను హతమార్చాలని అమెరికన్‌ ఆర్మీని ఆదేశించారు. ‘కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టం. వారిని క్షమించం. వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా పౌరులను తరలిస్తాం. మా మిషన్‌ కొనసాగుతుంది. కాబూల్‌ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్‌ కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని జో బైడెన్‌ ప్రకటించారు.

‘ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా.. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తాము ప్రమాదకర మిషన్‌ను కొనసాగిస్తున్నాం. బాంబు దాడులు జరిగినా కాబుల్‌ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదు. ఈనెల 31 నాటికి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అన్నారు. తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే అఫ్గానిస్థాన్‌లో నెత్తుటేర్లు పారాయి. గురువారం సాయంత్రం బాంబు దాడులతో కాబూల్‌ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఉగ్ర దాడితో హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయం రక్తసిక్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లోని ‘అబే’ గేట్‌, విమానాశ్రయం ఆవరణలోని బారోన్‌ హోటల్‌ వద్ద వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కాగా, బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles