Panic grips people as sea recedes in Antarvedi సముద్రంలో అల్లకల్లోలం.. ఓ చోట ముందుకు.. మరోచోట వెనక్కు..

Panic grips people as sea recedes in antarvedi and kanyakumari

Annachellali Gattu, Antarvedi. East Godavari Sea, East West Godavari, Mogalturu Mandal. West Godavari, Andhra pradesh, Kanya Kumari, Tamil Nadu

The sea rising in antarvedi, the sea receding in the uppada, the earthquake in the sea are now changing due to the tsunami fear in Andhra Pradesh.

సముద్రంలో అల్లకల్లోలం.. ఓ చోట ముందుకు.. మరోచోట వెనక్కు.. భయాందోళనలు

Posted: 08/26/2021 01:20 PM IST
Panic grips people as sea recedes in antarvedi and kanyakumari

బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం, అంతర్వేదిలో సముద్రుడు అలజడి సృష్టిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్న ఫుణ్యధామం సహా పలు ప్రాంతాల్లో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రుడినే నమ్మి జీవించే మత్స్యకార కుటుంబాలు కూడా గతంలో సంభవించిన ప్రళయాలను గుర్తుచేసుకుంటూ.. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిస్థితుల్ని గమనిస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి. కానీ, ఇపుడు సముద్ర తీరంలో వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా, కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రుడిని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రం ముందుకు రావడంతో తీరమంతా మునిగిపోయి నీరే కనిపిస్తోంది. ఫలితంగా సముద్రం ఒడ్డున నిర్మించిన షాపులు కూలిపోయాయి. ఇక గత వారం రోజుల క్రితం సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అలల తాకిడి కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న భవనం ధ్వంసమైంది. అలల ఉధృతికి కింద నేల కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

20 ఏళ్లకోసారి సముద్రం ఇలా ముందుకు వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తుండగా.. ఇక్కడికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరం వద్ద సముద్ర జలాలు వెనక్కి వెళ్లడం గమనార్హం. అంతర్వేదిలో అన్నాచెల్లెలి గట్టు అంటే చాలా ఫేమస్. ఇప్పుడక్కడ సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. మరో కొన్ని చోట్ల సముంద్ర ఏడారి దీవులను తలపిస్తోంది. అనుహ్యంగా రెండు రోజుల వ్యవధలో చోటుచేసుకుంటున్న మార్పులతో సముద్ర తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles