MLA Gorantla Buchchaiah Chowdary to quit TDP టీడీపికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాక్.. అసంతృప్తితో రాజీనామా

Big jolt to tdp senior leader rajahmundry rural mla gorantla to quit party

BIg jolt to TDP, Rajahmundry rural MLA, Gorantla Buchchaiah Chowdary, ChandraBabu Naidu, Nara Lokesh, Andhra Pradesh, Politics

The TDP received a big jolt on Thursday with the news of Rajahmundry Rural MLA Gorantla Buchchaiah Chowdary is ready to resign for his MLA post and TDP membership. The senior TDP leader is upset with TDP chief N Chandrababu Naidu and TDP national general secretary Nara Lokesh for not attending his calls.

టీడీపికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాక్.. అసంతృప్తితో రాజీనామా

Posted: 08/19/2021 01:34 PM IST
Big jolt to tdp senior leader rajahmundry rural mla gorantla to quit party

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా.? మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో నాయకత్వ లేమికి అధిష్టానమే కారణమవుతోందా.? అంటే ఔనన తప్పదు. పార్టీకి కంకణ బద్దులు, అకుంఠిత దీక్షతో పార్టీని ముందుకు నడుపుతున్న నాయకుల్లో సీనియర్ నాయకుడైన గొరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. అధిష్టానం పిలుపినిచ్చిన కార్యక్రమాల నిర్వహణతో పాటు పార్టీని, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నవారిలో ఆయన కూడా ప్రముఖుడు. అంతేకాదు అసెంబ్లీలో విపక్షాలపై తనదైనశైలిలో సూటిగా విమర్శలను సంధించగల నాయకుడు.

అలాంటి నాయకుడు ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నారా.? ఆయన టీడీపీ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే గత ఎన్నికలలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో పలువురు అధికార పార్టీ తీర్థం తీసుకోగా, మరికొందరు పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా చడీచప్పుడు లేకుండా ఇదివరకే బీజేపి పార్టీలో చేరారు. ఇలా పార్టీలోని సీనియర్ నాయకగణం అంతా టీడీపీని వీడి ఇతర పార్టీల పడుతున్నారు.

ఈ క్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల మరో రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం లేదని గోరంట్ల అసంతృప్తికి గురైనట్టు సమాచారం. తనలాంటి సీనియర్ ను కూడా హైకమాండ్ సరిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. తాను ఫోన్ చేసినా అటు పార్టీ అధినేత చంద్రబాబు కానీ లేదా ఇటు నారా లేకేష్ కానీ తన ఫోన్లకు స్పందించని కారణంగా అసహనం వ్యక్తం చేసిన ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఇప్పుడేమీ వివరణ ఇవ్వనని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పటికీ, అంతకుమించి మాట్లాడేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. స్థానిక నాయకత్వం, అనుబంధ కమిటీల వ్యవహారంలో గోరంట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. స్థానికంగా ఎమైనా ఇబ్బందులు ఉంటే తనకు చెప్పాలని సూచించారు. అయినా ఆయన వెనక్కు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. పార్టీ శ్రేణులు బుజ్జగిస్తే ఆయన వెనక్కి తగ్గుతారా? అనే విషయంలో క్లారిటీ లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles