Abhishek Banerjee faces BJP protest in Tripura మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్ పై దాడి

Tmc mp abhishek banerjee alleges his convoy is attacked in tripura shares video

Abhishek Banerjee, TMC vs BJP, Abhishek Banerjee Tripura, Abhishek Banerjee convoy attacked, Abhishek Banerjee, Mamata Banerjee, TMC, BJP, convoy attacked, Twitter, video, Tripura, Politics, Crime

Trinamool Congress (TMC) MP Abhishek Banerjee, on Monday alleged that his convoy was attacked allegedly by 'BJP workers' during his visit to Tripura. Taking to Twitter, Banerjee shared a video of the alleged protest against his convoy and raised questions over 'democracy in Tripura' under the BJP rule.

ITEMVIDEOS: టీఎంసీ నేత, మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్ పై దాడి

Posted: 08/02/2021 06:31 PM IST
Tmc mp abhishek banerjee alleges his convoy is attacked in tripura shares video

తృణ‌మూల్ కాంగ్రెస్‌ ఎంపీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ త్రిపుర పర్యటన ఆద్యంతం నిరసనలు, దాడుల నేపథ్యంలోనే సాగింది. అగర్తలా విమానాశ్రయంలో దిగిన ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై బీజేపి పార్టీ జెండాలను పట్టుకున్న కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో త్రిపురలోని అధికార బీజేపికి- తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య మళ్లీ అగ్గిరాజేసుకుంది. కాగా, బీజేపీ నేతలే తనపై దాడి చేయించారని అభిషేక్‌ బెనర్జీ ట్విట్టర్‌లో ఆరోప‌ణ‌లు చేశారు.

”బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఎంతటి ఉన్నత స్థాయికి చేరిందో ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. త్రిపుర ముఖ్యమంత్రి (విప్లవ్‌ దేవ్‌) మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను” అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను అభిషేక్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తన కాన్వాయ్ పై జరిగిన దాడికి బీజేపి నాయకుల ప్రేరణే కారణమని ఆరోపించారు.

దేశంలో ఏ ప్రాంతానికి చెందిన నాయకుడైనా ఏ ప్రాంతంలోనైనా పర్యటించేందుకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం వుందని అన్నారు. అయితే త్రిపుర అధికార బీజేపి పార్టీలో మాత్రం తృణముల్ కాంగ్రెస్ నేతలు పేర్లు చెబితేనే జంకు పుడుతోందని.. అందుకు తమ పర్యటనలను అడ్డుకోవడానికి వారు చేస్తున్న దాడులే కారణమని టీఎంసీ నేతలు విమర్శించారు. కాగా, పొరుగు రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కారుపై దాడి చేయటాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఆ పార్టీ రాజ్యసభ స‌భ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ ఈ విష‌యాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhishek Banerjee  Mamata Banerjee  TMC  BJP  convoy attacked  Twitter  video  Tripura  Politics  Crime  

Other Articles