India Registers First Double Infection Covid-19 Case దేశంలో తొలిసారి డబుల్ ఇన్పెక్షన్ కేసు.. అస్సోం డాక్టరు..

Assam doctor infected with alpha and delta variants of coronavirus simultaneously

Assam female doctor, double variant case, alpha variant, delta variant, covid, assam doctor, double variant case, corona virus, covid-19

A female doctor from Assam may be India’s first patient to be infected by two different variants of Covid-19 at the same time. The woman has reportedly been infected by both the Alpha and Delta variants of SARS-CoV-2.

దేశంలో తొలిసారి డబుల్ ఇన్పెక్షన్ కేసు.. అస్సోం డాక్టరు..

Posted: 07/20/2021 07:49 PM IST
Assam doctor infected with alpha and delta variants of coronavirus simultaneously

కరోనా మహమ్మారి తన రూపాన్ని మార్చి ప్రజలను ఇబ్బందులను పెడుతుండగా, తాజాగా ఒకేసారి రెండు వేరియంట్లు ఒకే వ్యక్తిలో బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇలా రెండు వేరియంట్ల కరోనా వైరస్ సోకిన వారు విదేశాలలో అనేకులు వుండగా, మన దేశంలో మాత్రం తొలిసారిగా కరోనా డబుల్‌ ఇన్ఫెక్షన్‌ కేసు నమోదైంది. అసోంలో ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సైతం ధ్రువీకరించారు. అయితే, సదరు వైద్యురాలు ఇంతకు ముందే రెండో మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు.

రెండు వాక్సీన్ డోసులు తీసుకున్నా తరువాత కూడా అమె డబుల్ వేరియంట్ల ఇన్పెక్షన్ కు గురికావడం అందోళన కలిగిస్తోంది. వైద్యురాలికి ఒకే సారి రెండు వేర్వేరు వేరియంట్లు సోకినట్లుగా గుర్తించామని అమెకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. ఆమె రెండు మోతాదులు వ్యాక్సిన్‌ తీసుకున్నారని అసోం దిబ్రూగఢ్‌ జిల్లా లాహోవాల్‌ ఐసీఎంఆర్‌ రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి బిశ్వాజ్యోతి బొర్కాకోటి చెప్పారు. ఇంతకు ముందు సదరు వైద్యురాలు కరోనా పాజిటివ్ గా పరీక్షించారని పేర్కొన్నారు. ల్యాబ్ లో ఆమె నమూనాలను పరిశీలించిన సమయంలో కొవిడ్‌ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ద్వారా ఒకే సమయంలో సోకినట్లు గుర్తించామని తెలిపారు.

ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్‌ సోకిందని అయినా.. డబుల్‌ వేరియంట్‌ ను నిర్ధారించేందుకు రెండుసార్లు నమూనాలను సేకరించామని బిశ్వాజ్యోతి వివరించారు. అయితే, ఆమెకు తీవ్ర సమస్యలేవీ లేవని, స్వల్ప లక్షణాణలు ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంతకు ముందు బెల్జియంలో 90 ఏళ్ల వృద్ధ మహిళకు ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకాయి. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించగా.. గత మార్చిలో ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఆ వృద్ధురాలు టీకా తీసుకోలేదని వైద్యులు తెలిపారు. అయితే, ఐసీఎంఆర్‌-ఆర్‌ఎంసీఆర్‌లో ఇప్పటి వరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు ఏవీ గుర్తించలేదని బిశ్వజ్యోతి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles