IOCL Recruitment: Graduate Apprentice Engineer Vacancy గేట్-2021 ఉత్తీర్ణత సాధించిన గ్రాడ్యూయేట్లకు ఉద్యోగ అవకాశాలు

Iocl assam recruitment 2021 graduate apprentice engineer vacancy

IOCL Assam Recruitment 2021, Indian Oil Corporation Limited, Engineer Jobs, Graduate Apprentice Engineer Jobs, Jobs in Assam, Indian Oil Corporation Limited Job Notification 2021, IOCL Job, IOCL Assam job vacancy 2021, IOCL Job Opening 2021, Assam, Politics

Indian Oil Corporation Limited released latest job notification for the recruitment of Graduate Apprentice Engineer Jobs in IOCL. Interested candidates can apply before the last date. IOCL announced an employment notification for the recruitment of Graduate Apprentice Engineer vacancies.

గేట్-2021 ఉత్తీర్ణత సాధించిన గ్రాడ్యూయేట్లకు ఉద్యోగ అవకాశాలు

Posted: 07/14/2021 05:35 PM IST
Iocl assam recruitment 2021 graduate apprentice engineer vacancy

కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల ఇంటర్ ఉత్తీర్ణతతో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ కూడా ఇంజనీర్లింగ్, గ్రాడ్యూయేట్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. అయితే గేట్-2021లో వచ్చిన
స్కోరు అధారంగా ఇంజనీర్లు, ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ల నియామకం చేపట్టనుంది. గేట్ స్కోర్ ప్రాతిపదికన ముందుగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు.

షార్ట్ లిస్టు లో ఉన్న అభ్యర్ధులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ టాక్స్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభకనబరిచిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు. నియామక ప్రక్రియ మొత్తం ఆన్
లైన్ లోనే నిర్వహిస్తారు. కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టిక్ ఇంజనీరింగ్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. గేట్-2021 క్వాలిఫై అయిన అభ్యర్ధులు
మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

గతంలో గేట్ లో అర్హత సాధించినప్పటికీ ఆ స్కోర్ ను పరిగణలోకి తీసుకోరు. అభ్యర్ధులు జులై 26వ తేది లోపు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఒకసారి ఆన్ లైన్లో ధరఖాస్తు సబ్ మిట్ చేశాక ఎలాంటి మార్పులు చేర్పులు అనుమతించరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వడ్ కేటగిరి అభ్యర్ధులు వారి కేటగిరి సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles