WHO warns against mixing and matching Covid vaccines వాక్సీన్ల మిక్సింగ్ ప్రమాదకరం.. ప్రపంచ అరోగ్య సంస్థ హెచ్చరిక

Dangerous trend who warns against mixing and matching covid vaccines

vaccine, mix and match, Soumya Swaminathan, coronavirus, Covid-19, world health organization, world health organisation, Dr Soumya Swaminathan, WHO chief scientist, WHO chief scientist Dr Soumya Swaminathan, WHO chief scientist Soumya Swaminathan, Covid-19 vaccine mix and match, mixing and matching Covid-19 vaccines, mixing and matching vaccines

The World Health Organization's (WHO's) chief scientist Dr Soumya Swaminathan on Monday warned against mixing and matching of Covid-19 vaccines by different manufacturers for the first and second doses, calling it a “dangerous trend” and saying that there was a lack of data about the impact of the process.

వాక్సీన్ల మిక్సింగ్ ప్రమాదకరం.. హెచ్చరించిన ప్రపంచ అరోగ్య సంస్థ

Posted: 07/13/2021 12:18 PM IST
Dangerous trend who warns against mixing and matching covid vaccines

కరోనా మహమ్మారి నుంచి ప్రజలు రక్షణ పోందేందుకు వాక్సీన్లు ఒక్కటే మార్గం అంటూ చెబుతున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ.. తాజాగా ప్రపంచ ప్రజలకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది. వాక్సీన్లు మిక్స్ చేసి తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని ప్రపంచ అరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ వార్నింగ్ ఇచ్చారు. వేర్వేరు టీకాలను తీసుకోవడం కానీ లేక రెండు, మూడు రకాల టీకాలను కలిపి తీసుకోవడం కానీ ప్రమాదానికి దారి తీయవచ్చునని అమె హెచ్చరించారు. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రూ త‌మ‌కు న‌చ్చిన రీతిలో వ్యాక్సిన్లు తీసుకోవ‌ద్దు అని తెలిపారు.

జెనీవా నుంచి ఆన్ లైన్లో మాట్లాడుతూ ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు సూచించిన టీకాల‌ను మాత్ర‌మే వేసుకోవాల‌ని చెప్పారు. వ్యాక్సిన్ల‌ను మిక్స్ చేయ‌డం వ‌ల్ల కానీ, మ్యాచింగ్ చేయ‌డం వ‌ల్లే క‌లిగే ప‌రిణామాల‌పై ఎటువంటి డేటా అందుబాటులో లేద‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ అంశంపై అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయ‌ని, వాటి డేటా కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఆమె చెప్పారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వ‌ల్ల క‌లిగే రోగ‌నిరోధ‌క శ‌క్తి, ర‌క్ష‌ణ అంశాల‌ను ప‌రిశీలించాల్సి ఉంద‌న్నారు. ఒక‌వేళ ప్ర‌జ‌లే త‌మ‌కు న‌చ్చిన నిర్ణ‌యాలు తీసుకుంటే… అప్పుడు ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంద‌ని, రెండ‌వ.. మూడ‌వ‌.. నాలుగ‌వ డోసులు తీసుకోవాల‌న్న ఆలోచ‌న స‌రికాద‌న్నారు.

సింగిల్ డోసు జాన్సెన్ టీకా తీసుకున్న వారు .. బూస్ట‌ర్ డోసు రూపంలో మ‌రో కంపెనీ టీకాను వేయించుకోవ‌చ్చు అని ఇటీవ‌ల ఓ శాస్త్ర‌వేత్త తెలిపారు. జాన్సెన్ టీకా తీసుకున్న వారు.. ఫైజ‌ర్ లేదా మోడెర్నాకు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకాను వేసుకోవాల‌న్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ఇదే కీల‌క‌మ‌ని ప‌రిశోధ‌కురాలు ఏంజిలా రాస్ మూసెన్ తెలిపారు. ఏప్రిల్‌లో జాన్సెన్ టీకా తీసుకున్న తాను.. మ‌ళ్లీ ఫైజ‌ర్ టీకా బూస్ట‌ర్ గా వేసుకున్నానని అందరూ తనలాగే చేయాలని సూచించారు. దీని ప‌ట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

వ్యాక్సిన్ మిక్సింగ్‌, మ్యాచింగ్ స‌రికాద‌న్నారు. బూస్ట‌ర్ డోసుల‌ను పేద దేశాల‌కు త‌ర‌లించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ సంప‌న్న దేశాల‌ను కోరారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వ‌ద్దు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చినా.. కెన‌డా మాత్రం ఆ బాట‌లోనే ముందుకు వెళ్లేందుకు సిద్ద‌మైంది. టీకాల మిక్సింగ్‌ను ఆ దేశం స‌మ‌ర్థించుకున్న‌ది. ఒక‌వేళ రెండ‌వ డోసు అందుబాటులో లేకుంటే, అప్పుడు ఫైజ‌ర్ లేదా మోడెర్నా టీకాల్లో ఏదైనా వేసుకోవ‌చ్చు అని వ్యాక్సినేష‌న్‌పై కెన‌డా జాతీయ స‌ల‌హా క‌మిటీ పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలోనూ సౌమ్యా వార్నింగ్ ఇచ్చారు. అయినా మిక్సింగ్‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కెన‌డా తేల్చి చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles