Komatireddy Venkatreddy Calms down! పదవి దక్కలేదనే అవేదన వుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Sensational comments out of sadness and disappointment komatireddy venkatreddy

Bhongir MP, MP Komatireddy Venkat Reddy, controversial remarks, Congress Senior Leader, Revanth Reddy, TPCC president, Manickam Tagore, Telangana, Politics

Bhongir MP Komatireddy Venkat Reddy has come out and issued a clarification about his controversial remarks and tried to settle the issue. The Congress Senior Leader says that he had made sensational comments on Revanth Reddy only after disappiontment after fullfilling all the qualifications for the post of TPCC president.

అర్హతలు వున్నా పదవి దక్కలేదనే అవేదన వుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Posted: 07/08/2021 05:09 PM IST
Sensational comments out of sadness and disappointment komatireddy venkatreddy

పీసీసీ అధ్యక్ష పదవికి అన్ని అర్హతలు వున్నా తనను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికీ ప్రాముఖ్యతను ఇవ్వడం పట్ల అవేదన తనలో వుందని భువనగిర పార్లమెంటు సభ్యుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనకు తప్పక పదవి వస్తుందని ఆశించానని, అయితే తనను కాకుండా రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టడంతో తాను తీవ్రంగా భంగపడటంతో అవేదన చెందానన్నారు. తీవ్ర అవేధనతో పాటు మనస్తాపం కూడా చెందానని, దాంతోనే తాను రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. తనకు పదవి రాలేదన్న మనస్తాపంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్‌ నేతగా తాపే ఈ వ్యాఖ్యలు చేశానే తప్ప దురుద్దేశంతో కాదని అన్నారు.

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా భువనగిరిలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందాయని అయితే తాను ఏ పార్టీలో చేరనని.. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతామన్న ఆయన తనకు గ్రూపు రాజకీయాలు చేయడం చేతకాదని చెప్పారు. గాంధీభవన్ లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం. ప్రజలతో మమేకమై గ్రూపులు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం. కేసీఆర్ ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.  అన్ని అర్హతలు వుండి.. పదవి రాకపోతే బాధగా వుండదా.? అని ప్రశ్నించారు.

అంత మాత్రాన పార్టీ మారతామా ? అందుకు ఎంతమాత్రం అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేసి ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద రోడ్డుపై కూర్చున్న వ్యక్తిని తానని, తనకు ప్రజా అభిమాను, ప్రజాబలం వుందని, తనలాంటి వ్యక్తికి ఏ పదవి అవసరం లేదని అన్నారు. భువనగిరి ఎంపీగా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు తనను గెలిపించారని కోమటిరెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందని కోమటిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకమాండ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles