Covaxin 77.8% effective, says Bharat Biotech ‘కొవాగ్జిన్‌’ సామర్థ్యం 77.8%.. ప్రకటించిన భారత్‌ బయోటెక్‌

Bharat biotech says completed final analysis for covaxin claims 77 8 efficacy

covid-19 infections, corona vaccine, Covid-19, Covaxin, Covishield, covaxin, covaxin efficacy, Bharat biotech, Covaxin Vaccine, Phase 3 trials, results Released, vaccine

Pune-Based drugmaker Bharat Biotech says the final efficacy analysis of Covaxin shows it to be 77.8 per cent effective against symptomatic Covid-19. The drugmaker evaluated 130 confirmed cases, with 24 observed in the vaccine group versus 106 in the placebo group.

‘కొవాగ్జిన్‌’ సామర్థ్యం 77.8శాతం.. ప్రకటించిన భారత్‌ బయోటెక్‌

Posted: 07/03/2021 09:35 PM IST
Bharat biotech says completed final analysis for covaxin claims 77 8 efficacy

కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను భారత్‌ బయోటెక్‌ శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‌లో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ ప్రకటించింది.

కొవాగ్జిన్​ తీవ్ర లక్షణాలు నిలువరించి హాస్పిటలైజేషన్‌ తగ్గిస్తోందని పేర్కొంది. కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ మెడ్‌జివ్ (medRxiv)లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కొవాగ్జిన్‌ టీకా సురక్షితమైందని రుజువైందని కంపెనీ పేర్కొంది. నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే.. జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. ట్రయల్స్‌లో 146 రోజుల పాటు.. వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు.

ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లయిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid-19 infections  Bharat Biotech  Covaxin  Covaxin Vaccine  Phase 3 trials  results Released  

Other Articles