Accept Covishield, Covaxin or face mandatory quarantine యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్.!

Recognise covidshield covaxin or india warns eu nations

India warning to European Union, India warning to EU countries, Indian vaccination, covaxin, covishield, India, Indian vaccines, pfizer, moderna, astrazenica, johnson, european vaccines, Quarantine, India warns EU, Coronavirus, Coronavirus vaccine, Covid-19, European Union, Bharat Biotech,Serum Institute of India, Mandatory quarantine, WHO, India Covid vaccine, Covid vaccine details, Covid-19 vaccine, covid19, corona

Since the Indian vaccines, Covaxin or Covishield are facing trouble in the European countries, the Indian government has stepped up and warned of consequences if their citizens face any issues in these foreign countries.

యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్.!

Posted: 07/01/2021 12:41 PM IST
Recognise covidshield covaxin or india warns eu nations

గ్రీన్‌ పాస్‌ పోర్ట్‌ స్కీమ్‌ కింద యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ, ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారతీయులను కూడా యూరప్‌ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరింది. ఈ మేరకు ఓ వైపు విన్నవిస్తూనే మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారతీయులను యూరోప్ దేశాల పర్యటనకు అంగీకరించకుంటే, ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని తేల్చిచెప్పింది.

యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు రాగానే తప్పనిసరి క్వారంటైన్ లోకి వెళ్లేలా నిబంధనలను సవరిస్తామని హెచ్చరించింది. ఇక దీనిపై మీరే తేల్చుకోవాలని చెప్పింది. ప్రస్తుతం ఇండియాలో సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ యూరోపియన్ దేశాల్లో ఇస్తున్న అస్ట్రాజెనికా వాక్సీన్ ఒక్కటే అయినా ఆంక్షలను ఎందుకు పెట్టారన్నది అర్థంకావడం లేదు, ఇక ఫైజర్-బయోఎన్ టెక్ సారధ్యంలో రూపోందిన కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం కూడా తెలిసినా.. అటు ఫైజర్, ఇటు అస్ట్రాజెనికా వాక్సీన్లను అనుమతిస్తూ ఇండియాలో తయారైన కోవిషీల్డ్; కొవాగ్జిన్ లను ఎందుకు అమోదించడం లేదని ప్రశ్నించింది.

టీకాలను తీసుకున్న వారు చూపించే డిజిటల్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈయూకు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ అనుమతించిన టీకాలను తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాటిల్లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, జాన్సస్ టీకాలు ఉన్నాయి. ఇక ఇదే విషయమై భారత్ లో ఈయూ ప్రతినిధి ఉగో అస్టుటోను ప్రశ్నించగా, టీకాల విషయంలో ప్రతి అనుమతి పొందాలంటే, కొన్ని నిబంధనలను పాటించాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles