Former Minister Etala Rajender joins BJP Party తరుణ్ చుగ్, కిషన్ రెడ్డీ సమక్షంలో బీజేపిలో చేరిన ఈటెల..

Former minister etala rajender joins bjp party

Etela Rajender joins BJP, Etela joins BJP, Former Telangana minister Etala Rajender, Telangana CM KCR, Enugu Ravinder Reddy, Aswadhama Reddy, Ramesh Rathode, Tula Uma, CM KCR, TRS, Telangana movement, BJP, JP Nadda, Bandi Sanjay, Raghunanadan Rao, Talangana, politics

Former Telangana Health Minister Etela Rajender who recently resigned from the minister post, and the Telangana Rashtra Samithi today has resigned for the membership of his Legislative Assembly by submiting his resignation letter to the Assembly secretary.

తరుణ్ చుగ్, కిషన్ రెడ్డీ సమక్షంలో బీజేపిలో చేరిన ఈటెల..

Posted: 06/14/2021 02:05 PM IST
Former minister etala rajender joins bjp party

తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాను ఓ సమిధనై పోరాడి సాధించానని.. ప్రస్తుతం తన ఆత్మగౌరవానికి సంబంధించిన ఆంశం తెరపైకి వచ్చిందని.. ఈ విషయంలోనూ తాను ఉద్యమిస్తానని, విజయం సాధిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన తరువాత టీఆర్ఎస్ పార్టీకి విడ్కోలు పలికిన ఈటెల ఇటీవలే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇవాళ ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర బీజేపి తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపి కేంద్ర కార్యాలయంలో ఈటెల రాజేందర్ తో పాటు పలువురు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాక్షిగా ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరారు. ఈటెల రాజేందర్ కు తరుణ్ చుగ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతం పలికారు. ఈటలతో పాటు.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి సహా.. మరికొందరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీలో చేరిన ఈటెల సహా పలువురు నేతలకు కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్ పార్టీ సభ్యత్వాన్ని అందించారు.

బీజేపి పార్టీలో చేరిన సంరద్బందా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విస్తరణకు తాను ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తన శాయశక్తులు పైర్తి చేసి, రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిలా తయారు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీని పటిష్టస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలుంటాయని వెల్లడించడం గమనార్హం. తనను చేర్చుకున్నందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మాట్లాడుతూ.. 'బీజేపీపై విశ్వాసంతో ఈట‌ల రాజేంద‌ర్ పార్టీలో చేరారని అన్నారు. నియంతృత్వ పాల‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని గొప్ప నిర్ణ‌యం తీసుకుని, కాషాయ జెండా ప‌ట్టుకుని ముందుకు సాగాల‌ని, తెలంగాణలో 'గడీల పాలన'ను బద్దలు కొట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు' అని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. 'బీజేపీ త‌ర‌ఫున స్వాగతం ప‌లుకుతున్నామని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం బీజేపీ అండ‌గా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ద‌మ్ము, ధైర్యం ఉన్న‌ పార్టీ బీజేపీ ఉన్నాయని తెలిపారు. ప్ర‌ధాని మోదీ పాల‌న‌లో ప్ర‌పంచంలో భార‌త్ శ‌క్తిమంతంగా త‌యార‌వుతోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etala Rajender  KCR  CM KCR  TRS  Telangana movement  BJP  JP Nadda  Bandi Sanjay  Raghunanadan Rao  Telangana  Politics  

Other Articles