19-year-old Dalit girl gang-raped in Bareilly యూపీలో మళ్లీ అదే ఆకృత్యం.. దళిత యువతిపై గ్యాంగ్ రేప్..

19 year old gang raped in up s bareilly three of six accused arrested

Bareilly, Bareilly news, Bareilly gangrape, Bareilly teen gang-rape, Bareilly dalit girl gangrape, up gang-rape, up dalit gang-rape, up dalit teen gang-rape, Dalit girl, gangrape, UP rape cases, Sexual assault, Bareilly gang rape, crimes against women, Izzatnagar police, Bareilly, Uttar Pradesh, Crime

Three men have been arrested in connection with the alleged gangrape of a 19-year-old Dalit woman in this Uttar Pradesh district, police said. Senior Superintendent of Police Rohit Singh Sajwan said two of the accused were arrested on Sunday, while one was held on Monday. The incident occurred in the Izzatnagar police station area of Bareilly city on May 31.

ఉత్తర్ ప్రదేశ్ లో మళ్లీ అదే ఆకృత్యం.. దళిత యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్

Posted: 06/08/2021 12:13 PM IST
19 year old gang raped in up s bareilly three of six accused arrested

ఉత్తరప్రదేశ్ లో దళిత యువతులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దళిత యువతులపై ఆ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు సంచలనం అవుతుండగా, వారిపై అకృత్యాలకు పాల్పడిన వారు ఎదుర్కోంటున్న శిక్షలను అక్కడి ప్రభుత్వం, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడంతోనే ఇలా జరుగుతుందా.? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. మోరల్ పోలీసింగ్ పేరుతో ప్రేమికులను అడ్డుకోగలుగుతున్న సంఘాలు అత్యాచార యత్నాలకు పాల్పడుతున్న వారిపై మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. తాజాగా స్నేహితులు కదా అని వారితో కలసి బయటకు వెళ్లిన 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది.

బరేలీలో గత నెల 31న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి తన స్నేహితులైన ఇద్దరు యువకులతో కలిసి స్కూటీపై బయటకు వెళ్లింది. ఈ క్రమంలో వారిని అడ్డగించిన ఓ యువకుడు తన స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వారొచ్చి బాధితురాలి స్నేహితులను బెదిరించి అక్కడి నుంచి పంపేసి యువతిపై వారంతా  అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం  ఆమె వద్దనున్న డబ్బులు తీసుకుని పరారయ్యారు.

జరిగిన ఘోరం గురించి పెదవి విప్పని బాధితురాలు తాజాగా తన సోదరికి వివరించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఆదివారం వారిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయినా వెనక్కి తగ్గని పోలీసులు  ఓ నిందితుడి కాలుపై కాల్చడంతో ఇద్దరు నిందితులు చిక్కారు. వారిని విశాల్ పటేల్ (22), అనుజ్ పటేల్ (23) గా గుర్తించారు. సోమవారం మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles