No Jeans, T-shirts & Beard Allowed for CBI staff సీబీఐ అధికారులూ ఇక పార్మల్ లోనే విధులు..

No jeans t shirts or sports shoes cbi asks staff to wear only formals

Subodh Kumar Jaiswal, Subodh Jaiswal, CBI, NEW CBI director, CBI Employees, formal attire, NEW CBI director, Jeans pant, T Shirts, sports shoes, sarees, suits, shaving, staff, officers, formals, CBI news

In an order new CBI Director, Subodh Kumar Jaiswal has directed all officials of the agency to be dressed in formals on duty, warning them that casual dressing will not be allowed. While all male staff should be dressed in trousers, collared shirts and formal shoes with proper shaving, female staffers will wear suits, sarees, formal shirts and trousers.

జీన్స్ ఫ్యాంట్, టీ-షర్ట్, గడ్డానికి చెల్లు చీటి.. సీబీఐ అధికారులూ ఇక పార్మల్ లోనే విధులు..

Posted: 06/04/2021 07:02 PM IST
No jeans t shirts or sports shoes cbi asks staff to wear only formals

ఒక శాఖకు నూతన అధికారులు వచ్చేరంటే వారి ఉనికి చాటుకునేందుకు ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని అలోచిస్తారు. మరికోందరు మాత్రం ఇన్నాళ్లు ఉన్న ఒరవడినే కొనసాగిస్తూ.. తాము చేయాల్సిన పనులపైనే దృష్టి పెడతారు. అయితే మొదటి వర్గానికి చెందినవారే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్. ఆయన ఇటీవ‌లే నియమితుడైన విష‌యం తెలిసిందే. వచ్చి రావడంతోనే తమ దర్యాప్తు సంస్థ ఉద్యోగులు వేసుకోవాల్సిన‌ దుస్తుల విష‌యంలో ఆయ‌న తాజాగా తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ ఫార్మ‌ల్ డ్రెస్ వేసుకునే రావాల‌ని, జీన్స్‌, స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వ‌స్తే ఉపేక్షించ‌బోన‌ని ఆయ‌న పేర్కొనడం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఆయ‌న జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం... పురుషులు ఫార్మ‌ల్ చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు మాత్ర‌మే వేసుకుని విధుల‌కు రావాలి. అలాగే, చ‌క్క‌గా షేవింగ్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అంతేకాదు, సీబీఐలో ప‌నిచేస్తోన్న మ‌హిళాధికారులు కూడా చీర‌లు, సాధార‌ణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని మాత్ర‌మే రావాలి.

మ‌హిళా సిబ్బంది జీన్సు, టీష‌ర్టులు, స్పోర్ట్స్ షూ, చెప్పులు, అలంక‌ర‌ణ‌లతో కార్యాల‌యాల‌కు రావ‌ద్ద‌ని ఆదేశించారు. ఈ నియ‌మ నిబంధ‌ల‌ను దేశ వ్యాప్తంగా సీబీఐ సిబ్బంది క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని అందులో పేర్కొన్నారు. నిజానికి సీబీఐ అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ ఫార్మ‌ల్ డ్రెస్‌నే వేసుకోవాల్సి ఉంటుంద‌ని ఓ అధికారి మీడియాకు చెప్పారు. అయితే, చాలా ఏళ్లుగా వారు ఈ నిబంధ‌న‌ను పాటించ‌డం లేద‌ని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subodh Kumar Jaiswal  NEW CBI director  Jeans pant  T Shirts  sports shoes  sarees  suits  shaving  staff  officers  formals  CBI news  

Other Articles