Frivolous cases making SC dysfunctional చిల్లర కేసులతో సుప్రింకోర్టు సమయం వృధా

Frivolous cases are delaying matters of national importance supreme court

Supreme Court, Cases Filed in Supreme Court, Frivolous Cases, National Importance cases, Justice Chandrachud, apex court, pan india matters

The Supreme Court bench said, "Frivolous matters are making the institution dysfunctional. These matters waste important time of the court, which could have been spent on serious matters, pan-India matters."

సుప్రింకోర్టు సమయాన్ని చిల్లర కేసులు వృధా చేస్తున్నాయ్: జస్టిస్ చంద్రచూడ్

Posted: 06/01/2021 08:23 PM IST
Frivolous cases are delaying matters of national importance supreme court

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు అమూల్యమైన సమయాన్ని అత్యంత అల్పమైన కేసులు వృధా చేస్తున్నాయని న్యాయస్థానం పేర్కొంది. దేశానికి సంబంధించి ఎంతో ముఖ్యమైన కేసుల విచారణకు ఈ చిన్న కేసులు, పనికిమాలిన కేసులు, అల్పమైన కేసులు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ చిన్న కేసుల వల్ల ఎంతో ప్రాముఖ్యతను పోందిన జాతీయ స్థాయి కేసుల విచారణకు ఆటకం కలుగుతుందని అభిప్రాయపడింది. ఇలాంటి కేసుల వల్ల కోర్టు కార్యకలాపాలు సజావుగా జరగకుండా ఆటంకం కలుగుతోందని పేర్కొంది.

గతంలో ఒకింత వచ్చే చిల్లర కేసులు ఈ మధ్యకాలంలో మరింత పెరిగిపోయాయని, ప్రస్తుతం లెక్కలేనంతగా చిల్లర కేసులతో తాము తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నామని అన్నారు. తద్వారా కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోందని తెలిపింది. వినియోగదారుల వివాదానికి సంబంధించిన ఓ కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈరోజు విచారించింది. వాస్తవానికి ఈ కేసును మార్చిలోనే కోర్టు ముగించింది. అయినప్పటికీ పిటిషనర్ మరో దరఖాస్తు ద్వారా కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, ప్రాధాన్యం లేని కేసులు వచ్చి పడుతుండటం వల్ల... ప్రధానమైన కేసులకు న్యాయమూర్తులు తగినంత సమయాన్ని వెచ్చించలేకపోతున్నారని అన్నారు. కరోనాకు సంబంధించి కోర్టు జరుపుతున్న స్వీయ విచారణలో నిన్న తుది ఆదేశాలను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... తాను అలా చేయలేకపోయానని... ఈరోజు విచారణలకు సంబంధించిన ఫైల్స్ ను తాను చదవాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తం కేసుల్లో 90 శాతం అల్పమైన కేసులే ఉంటున్నాయని అన్నారు. అల్పమైన కేసుల కోసం కోర్టు సమయం వృథా అవుతోందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles