leopard wandering in tirupati suburban colonies తిరుపతి శివారు ప్రాంతవాసుల్ని హడలెత్తిస్తున్న చిరుతలు

Leopard wandering in tirupati suburban colonies

Tirumala, Tiupati, Sheshachalam forest, Leopards, tirupati suburban colonies, forest officials, kapilatheertham, chittoor, Andhra Pradesh, Crime

Tirupati sub urban colonies people are scared as leopard from sheshachalam forests are wandering in the locality.

తిరుపతి శివారు ప్రాంతవాసుల్ని హడలెత్తిస్తున్న చిరుతలు

Posted: 06/01/2021 10:14 AM IST
Leopard wandering in tirupati suburban colonies

తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం, కలియుగ వైకంఠంగా ప్రసిద్ది చెందిన భక్తుల కొంగు బంగారం తిరుమల కొండపై భక్తుల సందడి తక్కువైంది. రోజుకు వేల సంఖ్యలో తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకునే భక్తులు వందల సంఖ్యలో వస్తున్నారు. దీంతో తిరుపతి పట్టణంలోనూ పెద్దగా జనసంచారం లేదు. ఇక దీనికి తోడు మధ్యాహ్నం 12 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ప్యూ విధించడంతో తిరుమల సహా రాష్ట్ర వ్యాప్తంగా జనసంచారం పూర్తిగా సన్నగిల్లింది. కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్రజలు బయటకు వెళ్తున్నారు.

దీంతో మధ్యాహ్నం తరువాత ఒకింత నిశబ్ద వాతావరణం అలుముకోవడంతో తిరుపతి తిరుపతి చుట్టూర వున్న శేషాచలం అడవుల్లోంచి వన్యప్రాణులు జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రాణులు చిరుతపులులు. తిరుమల కోండలోని అడవుల్లో సంచరించే ఈ ప్రాణాలు రాష్ట్రంలో మధ్యాహ్నం తరువాత అలుముకునే నిశబ్ద వాతావరణంలో అవి క్రమంలో జనారణ్యంలోని శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో  సంచారిస్తున్నాయి. నగర పరిధిలోని 45వ డివిజన్‌ శివజ్యోతినగర్ సమీపంలోకి ఆదివారం రాత్రి వచ్చిన చిరుతను చూసిన జనం భయంతో హడలిపోయారు.

అడవిలోంచి కాలనీలోకి ప్రవేశించిన చిరుత ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించింది. ఈ క్రమంలో చిరుతను భయపెట్టేందుకు కొందరు బాణసంచా కాల్చారు. మరికొందరు కర్రలు చేతపట్టుకుని తరిమారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించాయి.కాగా, ఇటీవలి కాలంలో తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా నడకదారిలో పలుమార్లు కనిపించిన చిరుతలు భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అవి అడవి నుంచి జనారణ్యంలోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles