Prashant Kishor's Dig At PM-Cares Covid Children Relief కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రశాంత్ కిషోర్..

Prashant kishor takes a dig at centre s covid scheme for orphaned children

Prashant Kishor, PM CARES, Covid children, Centre’s Covid scheme, orphaned children, Covid-19, PM-CARES for Children, Scheme for orphaned children, Prashant Kishor, Narendra Modi, PM CARES, Coronavirus, Orphans

Election strategist Prashant Kishor attacked the PM CARES aid announced by PM's Narendra Modi's Office (PMO) for children who have lost both their parents to the COVID-19 pandemic. He deployed sarcasm to imply that these were mere promises at a time when the minors needed immediate help.

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రశాంత్ కిషోర్..

Posted: 05/31/2021 10:33 AM IST
Prashant kishor takes a dig at centre s covid scheme for orphaned children

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్ర‌భుత్వంపై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కరోనా వైరస్ నియంత్రణ, ప్రజలకు వాక్సీన్ అందించే విషయంలోనూ ప్రధాని నరేంద్రమోడీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించిన ఆయన కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగుతూ మరో మాస్టార్ స్ట్రోక్ సంధించిందని అన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలను అదుకునే పేరుతో వారిని తమకు 18 ఏళ్లు వచ్చే వారకు పార్టీకి సానుకులంగా వ్వవహరించేలా వేసిన స్కెచ్ పూర్తిగా అసంబద్దమైనదని విమర్శించారు.

'మోదీ సర్కారు మరో మాస్టర్ స్ట్రోక్‌ ఇది' అంటూ కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో కేంద్ర స‌ర్కారు ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరును ఆయ‌న ప్ర‌స్తావించారు. కరోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకోవడంలో కేంద్ర స‌ర్కారు ప‌నితీరు అసమర్థంగా ఉంద‌ని విమర్శించారు. అనాథలైన చిన్నారులు తమకు ప్ర‌స్తుతం అవసరమైన సాయాన్ని అందుకోవడానికి బదులు 18 ఏళ్ల తర్వాత స్టైపెండ్‌ అందుతుందనే హామీ గురించి పాజిటివ్‌గా ఫీల్‌ అవ్వాలా? అంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

'ఇంత గొప్ప సాయం చేస్తున్నందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్ల‌ కృతజ్ఞత కలిగి ఉండాలి' అంటూ చుర‌కంటించారు. కాగా, క‌రోనా కార‌ణంగా అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో 577 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలా అనాథ‌లైన పిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాత నెలనెలా స్టైపండ్ ను అందిస్తామని, అంతేగాక‌, వారికి 23 ఏళ్లు వచ్చాక పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించింది. దీనిపైనే ప్రశాంత్ అలా స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles