Model Diksha Singh to contest UP panchayat poll ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

Model diksha singh to contest up panchayat elections 2021

Diksha Singh,UP Panchayat Election 2021,UP Panchayat chunav,UP Panchayat election, beauty queen Diksha Singh to contest UP panchayat poll, diksha singh, diksha singh elections, diksha singh miss india, diksha singh miss india 2015, diksha singh panchayat elections, Model, beauty queen, Diksha Singh, panchayat poll, Baksha Development Block, Jaunpur district Uttar Pradesh, Politics

Runner-up of a beauty pageant in 2015, Diksha Singh, is all set to take the political plunge. Diksha Singh has decided to contest the District Panchayat election from Ward No. 26 of Baksha Development Block of Uttar Pradesh's Jaunpur district.

ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

Posted: 04/03/2021 07:50 PM IST
Model diksha singh to contest up panchayat elections 2021

ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా బ్లాక్ పంచాయతీలోని 26వ వార్డు నుంచి ఆమె బరిలోకి దిగింది. దీక్షా సింగ్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తోపాటు పలు ప్రకటనల్లోనూ నటించింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగేందుకు దీక్ష సిద్ధమైంది. డెవలప్‌మెంట్ బ్లాక్ లోని చిటౌడీ గ్రామంలో నివసిస్తున్న జితేంద్రసింగ్ కుమార్తే దీక్ష.

తండ్రి కోరిక మేరకే రాజకీయాల్లో అడుగుపెట్టిన దీక్ష్.. తండ్రి నిర్ణయించిన 26వ బ్లాక్ నుంచి పోటీ చేయనుంది. అయితే, ఈ సీటును మహిళలకు కేటాయించడంతో కుమార్తె దీక్షను ఆయన బరిలోకి దించారు. తండ్రి మాటపై గౌరవంతో రాజకీయాల్లో కాలుమోపేందుకు దీక్ష సై అంది. వార్డు నంబరు 26 నుంచి పోటీకి దిగుతున్న దీక్ష ఇప్పటికే అవసరమైన దరఖాస్తును కొనుగోలు చేయడంతోపాటు బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. అంతేకాదు, ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.

బీజేపీ  సీనియర్ నేత రామ్ చంద్ర సింగ్ కోడలు షాలిని సింగ్ ‌తో ఇప్పుడు దీక్ష అమీతుమీ తేల్చుకోనుంది. షాలినీ సింగ్ గ్రాడ్యుయేట్. దీక్ష సింగ్ మాట్లాడుతూ.. తాను కాలేజీ రోజుల నుంచే కాంపిటిషన్లు, రాజకీయ చర్చల్లో పాల్గొంటున్నట్టు తెలిపింది. కాబట్టి తనకు రాజకీయాల గురించి తెలుసని పేర్కొంది. యూపీలో ఈ నెల 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీక్ష పోటీ చేస్తున్న జౌన్‌పూర్ జిల్లాలో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles