Priyanka jabs Sitharaman over oversight in sss rates cut నిర్మలకు దేశ విత్తమంత్రిగా కొనసాగే హక్కులేదు: ప్రియాంక

Priyanka gandhi jabs sitharaman over oversight comment in in sss rates cut

priyanka gandhi, priyanka gandhi tweet, nirmala sitharaman, interest rates, small saving schemes, middle class depositors, rollback order, assembly elections, national, politics

After the Centre withdrew its order to slash interest rates for small saving schemes, Congress leader Priyanka Gandhi took a jibe at Union finance minister Nirmala Sitharaman's "oversight in issuing order" comment and asked her if the decision to revoke the order was taken in view of the ongoing state elections..

ఎన్నికల జిమ్మిక్కు.. తరువాత ‘వడ్డీ రేట్ల’ కోత తప్పుదు: ప్రియాంక

Posted: 04/01/2021 05:34 PM IST
Priyanka gandhi jabs sitharaman over oversight comment in in sss rates cut

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ అదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇవాళ ఉదయం చిన్నమొత్తాల పోదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు వుండబోదని అవి యధావిధిగానే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మాల సీతారామన్ ఇవాళ తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు. పోరబాటుగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందుకే వెనువెంటనే దిద్దుకున్నామని అమె తన ట్వీట్ లో పేర్కోన్నారు.

దీంతో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గంటల వ్యవధిలోనే వెనక్కు తీసుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశంలోని కొన్ని కోట్ల మంది దిగువ మధ్యతరగతి, పేదలు తాము కష్టపడి ఆర్జించే రూపాయిలోని కొంతభాగాన్ని తమ పిల్లల భవిష్యత్తు కోసం చిన్నమొత్తాల పోదుపు పథకాల్లోనే వేస్తారని, వారిపై ఎంతో ప్రభావం చూపే ఆదేశాలపై పొరపాటు ఎలా జరిగిందని ప్రశ్నించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇక ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడింది.

దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. వడ్డీరేట్లను తగ్గించే ఉత్తర్వులను జారీ చేయడంలో నిర్మలా సీతారామన్‌ నిజంగానే పొరబడి ఆ తర్వాత దిద్దుబాటు చర్యగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా? లేదా దీని వెనుక ఎన్నికల ‘దూరదృష్టి’ ఏదైనా దాగివుందా’’అని అనుమానాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ ను ఉద్దేశిస్తూ.. కేంద్ర ఆర్థికమంత్రి.. సర్కార్ ను నడుపుతున్నారా.? లేక సర్కస్‌ నడుపుతున్నారా? అని ప్రశ్నించారు.

సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయంలో పోరబాటుకు అస్కారం ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నికల జిమ్మికని, ఎన్నికలు పూర్తైన తరువాత తప్పనిసరిగా వడ్డీ రేట్లు కుదింపు వుంటుందని, అందుకు కేంద్రం పెత్తనంలోని ఇంధన ధరలనే ఉదాహరణగా చూపుతున్నారు. ఎన్నికలకు ముందు స్థబ్దుగా వున్న ఇంధన ధరలు.. ఎన్నికలు పూర్తైన తరువాత దేశంలో ఎక్కడా రూ. 100కు తక్కువగా లీటరు పెట్రోలు లభ్యంకాదని అన్నారు.

కాగా నిర్మలా సీతారామన్ రేట్ల మదింపు వుండబోదని చెప్పడంతో మధ్యతరగతి ప్రజలు.. ఊపిరి పీల్చుకుంటున్నారు. పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, గురువారం ఉదయానికి ఈ నిర్ణయంపై కేంద్ర వెనక్కి తగ్గింది. ‘‘పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయి. పొరబాటుగా ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆర్థికమంత్రి ఈ ఉదయం ట్వీట్‌చేశారు. ఇక ఇలానే తమ ఆందోళనను కూడా పరిగణలోకి తీసుకుని కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని రైతలు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles