kurnool airport launched by CM Jagan కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు..

Orvakal airport launched and named as uyyalawada narasimha reddy airport

Orvakal Airport, kurnool airport, Andhra pradesh 6th airport, Union Minister P Hardeep Singh, CM YS Jagan, Uyyalawada Narasimha Reddy airport, Andhra Pradesh, Politics

YS Jagan Mohan Reddy inaugurated the Kurnool District Orvakal Airport, which was built by the state government. Along with him, Union Minister P Hardeep Singh was also present at the inauguration of Airport. CM Jagan, along with the Union Minister, inaugurated the airport and dedicated it to the nation.

కర్నూలు విమానాశ్రయాన్ని జాతికి అంకితమిచ్చిన సీఎం జగన్.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు..

Posted: 03/25/2021 02:36 PM IST
Orvakal airport launched and named as uyyalawada narasimha reddy airport

ఒకనాటి రాష్ట్ర రాజధాని ప్రాంతమైన కర్నూలు జిల్లాకు మణిలా వచ్చి చేరింది ఓ విమానాశ్రయం. జిల్లాలోని ఓర్వకల్లులో 1008 ఎకరాలలో నిర్మితమైనమైన ఈ విమానాశ్రయం ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్ధీప్ పూరీతో పాటుగా ఆయన విమానాశ్రయంలో తొలుత జాతాయ జెండాను ఎగురువేసి.. ఆ తరువాత విమానాశ్రయం టెర్మినల్‌ భవనం వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అవిష్కరించారు. ఆపైన నేరుగా విమానాశ్రయంలోకి కేంద్రమంత్రితో కలసి వెళ్లి విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... "కర్నూలుకు విమానాశ్రయాన్ని ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణాలు సాగించాల్సి వచ్చేదని, ఇక ఈ నెల 28 నుంచి విమాన ప్రయాణం కూడా అందుబాటులోకి రాబోతుందని అన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాల తరువాత కర్నూలు ఎయిర్ పోర్టు రాష్ట్రంలో ఆరవ విమానాశ్రయమని అన్నారు. ఈ నెల 28 నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అన్నారు.

ఇక ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేసిన ఆయన.. అందుకు గత విశిష్టతను కూడా తెలిపిరు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే  రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్య‌మం చేశార‌ని, ఆయ‌నకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా సీఎం జగన్ ప్ర‌క‌టించారు.  "ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బాబు గ‌తంలో ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారు. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారు" అని విమ‌ర్శించారు.
 
"మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశాం" అని జ‌గ‌న్ చెప్పారు. రూ. 153 కోట్ల రూపాయ‌ల‌ ఖర్చుతో నిర్మితమైన ఈ విమానాశ్రయానికి డీజీసీఏ సంక్రాంతి రోజున జనవరి 15న లైసెన్సు జారీ చేయగా, 27 సెక్యూరిటీ క్లియరెన్స్ లభించింది. 2 వేల మీటర్ల పోడువున, 30 మీటర్ల వెడల్పుతో రన్ వే కూడా నిర్మించారు. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలను తీసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles