BSF jawans run 180km to honour 1971 war veterans అమర జవాన్లకు వినూత్న రీతితో బిఎస్ఎఫ్ జవాన్ల అంజలి

Bsf personnel run 180km in less than 11 hours to honour 1971 war veterans

border security force, BSF, Indian Army, vijay diwas, pakistan, Indira Gandhi, Bangladesh, East Pakistan, BSF jawans relay race, 1971 war, Kiran Rijiju, BSF jawans video, Inspiring video, Patriotic video, viral video

BSF personnel ran a 180 kilometre relay race at midnight (December 13-14) at the international border to honour the 1971 war veterans. The race culminated at Anupgarh in less than 11 hours. Minister of State for Youth Affairs and Sports Kiren Rijiju lauded the BSF personnel who participated in the race.

విజయ్ దివస్: అమర జవాన్లకు వినూత్న రీతితో బిఎస్ఎఫ్ జవాన్ల అంజలి

Posted: 12/16/2020 10:31 AM IST
Bsf personnel run 180km in less than 11 hours to honour 1971 war veterans

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో తొలిసారిగా దాయాధి పాకిస్థాన్ తో జరిగిన యుద్దంలో భారత్ విజయకేతనం ఎగురువేసింది. అంతర్జాతీయ దేశాలు, ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఈ యుద్దంపై ఆంక్షలు పెట్టినా.. జరుగుతున్న యుద్దాన్ని అపలేమని.. విజయం ఎవరివైపున వుందన్న విషయం పూర్తిగా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం వుందని చాటిచెప్పిన ఇంధిరాగాంధీ పాకిస్థాన్ పై విజయకేతనం ఎగురువేశారు. అందుకు భారత సైన్యం కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లింది. అంతకుముందు రెండు పర్యాయాలు యుద్దం జరిగినా.. ప్రపంచదేశాల వినతుల నేపథ్యంలో భారత్ మధ్యలోనే విరమించుకుంది. అయినా పాకిస్థాన్ తన మేకపోతు గంభీర్యాన్ని నిత్యం భారత్ పై ప్రదర్శిస్తూనే మరోమారు కయ్యానికి కాలుదువ్వింది.

దీంతో 1971లో పాకిస్థాన్ పై యుద్దన్ని ప్రకటించిన భారత్.. ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు, విన్నతులు వెల్లువెత్తినా.. యుద్దాన్ని కోనసాగించి విజయాన్ని అందుకుంది. దీంతో 1971 నాటి యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన జవాన్ల గౌరవార్థం ఇవాళ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నారు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు విజయ్ దివస్ సందర్భంగా వినూత్నంగా అమరజవాన్లకు అంజలి ఘటించారు. దాదాపు 930 మంది జవాన్లు ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గోన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 930 మంది జవాన్లు విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని ఏకంగా 180 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 11 గంటల వ్యవధిలో పరిగెత్తి వారికి ఘననివాళులు అర్పించారు.

రాజస్థాన్ లోని బికనేర్ సమీపంలో దేశ సరిహద్దు వెంట ప్రారంభమైన ఈ రన్నింగ్ ర్యాలీ.. రాజస్థాలోని అనూప్ గడ్ వద్ద ముగిసింది. ఈ 180 కిలోమీటర్ల పోడువునా బీఎస్ఎఫ్ అధికారులు జవాన్లకు దేశభక్తి గీతాలను వినిపిస్తూ ఉత్తేజపర్చారు. మొత్తం 930 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ఒక్కోక్కరు ఏకంగా 500 నుంచి 600 మీటర్ల మేర విజయానికి చిహ్నంగా వెలుగుతూ వుండే టార్చ్ ను పట్టుకుని పరుగితెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. 1971లో పాకిస్థాన్ పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా, డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహిస్తారు. పాక్ ఓటమి తరువాతే తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSF  vijay diwas  pakistan  Indira Gandhi  Bangladesh  BSF jawans relay race  1971 war  Kiran Rijiju  viral video  

Other Articles