Man held for violatiing lockdown norms పోలీసులపై బండబూతులు.. బాంబుపెట్టి లేపేస్తానని బెదిరింపులు

Man held for abusing and threating police and violatiing lockdown norms

Coronavirus, Covid-19, police officer son, man arrested, langer house, obstucted police duties, abused police, threatened police, Hyderabad police, Telangana, crime

A man claiming to be a son of police official had been arrest at Langer House in Hyderabad for breaking the lockdown norms. The man obstructed the police from doing their duties and allegedly abused them and Threatned them.

ITEMVIDEOS: లాక్ డౌన్ ఉల్లంఘన: పోలీసులపై బండబూతులు.. బాంబుపెట్టి లేపేస్తానని బెదిరింపులు

Posted: 04/30/2020 01:46 PM IST
Man held for abusing and threating police and violatiing lockdown norms

కరోనా మహమ్మారిని కట్టడి చేసేపనిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డన్ అమల్లో వుండగా, లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు డ్యూటీల్లో ఉన్న పోలీసులపై నోటీకి అడ్డూఅదుపు లేకుండా విరుచుకుపడ్డాడో హైదరాబాదీ. తమ నిద్రాహారాలు మాని, బార్యబిడ్డలను వదలి అహర్నిషలు విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒంటికాలుతో లేవడమే కాకుండా వారి విధులకు అటంకం కలిగిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. బూతు మాటలతో వీరంగం సృష్టించాడు. నా తడాఖా చూస్తావా? బాంబు పెట్టి లేపేస్తా, పోలీస్ స్టేషన్‌ను లేపేస్తానంటూ ఆగ్రహావేశాలను ప్రదర్శించాడు.

గురువారం ఉదయం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటన. అనంతరం అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద పోలీసులు విధి నిర్వహణలో ఉన్న సమయంలో అటుగా బైక్‌పై దూసుకొచ్చాడో వ్యక్తి. లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకున్నారు. బైక్ తాళాలను లాక్కున్నారు. అంతే. తన నోటికి పని చెప్పాడా వ్యక్తి. తన ఎదురుగా ఉన్నది విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అనే విషయాన్ని కూడా విస్మరించినట్టున్నాడు. వారిపై పరుష పదజాలాన్ని ప్రయోగించాడు. బూతులు తిడుతూ దూసుకెళ్లాడు.

రాయడానికి వీల్లేని పదజాలంతో దూషించాడు. అతని దూకుడుకు పోలీసుల వద్ద సమాధానమే లేకుండా పోయిందంటే.. అతను ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలంలో నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ.. అతణ్ని అడ్డుకోలేకపోయారు. తొలుత అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు భావించారు. కొద్దిసేపటికే అతను మద్యం సేవించలేదనే విషయాన్ని నిర్దారించుకున్నారు. ఆ వ్యక్తి ఓ దశలో పోలీసులు ధరించిన మాస్క్‌ను కూడా లాగడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles