Ramadan, Eid prayers to be done at home రంజాన్ ప్రార్థనలపై సౌదీ మతపెద్ద తాజా అదేశాలు..

Saudi grand mufti ramadan eid prayers to be done at home

covid-19, coronavirus, lockdown, fight aginst covid-18, Lockdown, ramzan, prayers, taraweeh, Eid prayers, saudi arabia, grand mufti, lockdown, sheikh abdulaziz al-sheikh, coronavirus, covid-19, section 144, Janata curfew, Janta curfew, Janatha, curfew, Quarantine, Isolation, Self quarantine, Total cases, Dublin patient, Dublin, Google techie, Google, Bengaluru, Bangalore, Hyderabad, Chennai

Worshippers should offer Taraweeh during Ramzan and subsequent Eid prayers at home to prevent spreading Coronavirus, said Saudi Arabia's grand mufti, the highest religious authority in the kingdom.

రంజాన్ పవిత్రమాస ప్రార్థనలపై సౌదీ మతపెద్ద తాజా అదేశాలు..

Posted: 04/18/2020 04:47 PM IST
Saudi grand mufti ramadan eid prayers to be done at home

హ్మదీయుల పరమ పవిత్ర మాసం రంజాన్ మాసం. ఈ మాసంలో వారు అత్యంత నిష్టగా వుంటూ ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ప్రార్థనలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముస్లిం సోదరులందరూ ఈ ప్రార్థనలను సామూహికంగా తమ తమ మసీదుల్లో నిర్వహించుకోవడం అనవాయితి. అయితే వచ్చే వారం ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనల నిర్వహణ విషయంలో ప్రస్తుతం సందిగ్ధం కొనసాగుతోంది. కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అందోళనకు గురిచేస్తూ సామాజిక దూరం పాటించేలా చేస్తున్న క్రమంలో ప్రార్థనల విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

అయితే ఈ సమస్యలకు సౌదీ అరేబియాలోని మతపెద్ద ప్రధాన ముఫ్తీ తాజాగా సంచలన అదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని ముస్లింలందరూ రంజాన్ ప్రార్థనలన్నీఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, తారావీహ్‌ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సూచించారు.

రంజాన్‌ పర్వదినంలో మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా ప్రార్థనల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. సౌదీలో ఇప్పటి వరకు 7,142 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 87 మంది మృత్యువాతపడ్డారు. ఇటు హైదరాబాద్‌లోనూ జామియా నిజామియా సంస్థ ఇదే తరహా సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీనికి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సైతం మద్దతు తెలిపారు. సంస్థ సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles