sonia gandhi video message amid lockdown లాక్ డౌన్ నేపథ్యంలో దేశప్రజలకు సోనియాగాంధీ సూచనలు

Sonia gandhi thanks people for adhering to lockdown despite problems

covid-19, coronavirus, lockdown, Sonia gandhi, Congress President, video message, PM Narendra Modi, fight aginst covid-18, National Politics

On the last day of the lockdown, Congress interim President Sonia Gandhi thanked people for adhering to the lockdown despite problems. She also said that the Congress party workers are ready to help those in distress.

ITEMVIDEOS: లాక్ డౌన్ నేపథ్యంలో దేశప్రజలకు సోనియాగాంధీ సూచనలు

Posted: 04/14/2020 11:57 AM IST
Sonia gandhi thanks people for adhering to lockdown despite problems

కరోనా వైరస్ పై పోరుకు పాటిస్తున్న లాక్ డౌన్ కొనసాగింపు నేపథ్యంలో దేశ ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతీ పౌరుడు మహమ్మారికి వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాంధీ కోరారు. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అమె విడుదల చేసిన వీడియో సందేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశప్రజలందరి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. అప్పటివరకు దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని అమె పేర్కొన్నారు.

జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయనున్న వేళ, అంతకన్నా ముందుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "నా ప్రియమైన దేశ ప్రజలారా..." అంటూ ప్రారంభమైన ఈ వీడియోలో, కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ కంకణబద్దుడు కావాలని సూచించారు. వైరస్ భయాందోళనలను తగ్గేంతవరకు ప్రజలందరూ జాగ్రత్తచర్యలు పాటించాలని అమె కోరారు.

వైరస్ భయాందోళనలు తగ్గేంత వరకూ ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అన్నారు. ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ కూడా ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని అన్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ ధన్యవాదాలని వ్యాఖ్యానించారు.

ఇక, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే, ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌ డౌన్ అమలు చేస్తున్నారని, దీనివల్ల దేశం నష్టపోతోందని ఆరోపించారు. మరీ ముఖ్యంగా దేశంలోని పేదలు, గ్రామీణ బీదలు, రైతులు అత్యదికంగా నష్టపోతున్నారని, వారందరినీ అదుకునేందుకు కేంద్రం మరిన్నీ చర్యలు చేసట్టాలని సోనియా గాంధీ కొరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles