Nirbhaya case: Convict seeks FIR against policemen పోలీసులపై ఎఫ్ఐఆర్ కోసం నిర్భయ దోషి పిటీషన్

Nirbhaya case convict moves court for fir against cops for alleged prison assault

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

Pawan Kumar Gupta, one of the four death row convicts in the Nirbhaya gang rape and murder case, moved a Delhi court seeking registration of an FIR against two police constables for allegedly physically assaulting him when he was lodged at Mandoli jail last year.

నిర్భయ కేసు: పోలీసులపై ఎఫ్ఐఆర్ కోసం పవన్ గుప్తా పిటీషన్

Posted: 03/11/2020 06:29 PM IST
Nirbhaya case convict moves court for fir against cops for alleged prison assault

దేశవ్యాప్తంగా పెనుసంచలనం రేపిన నిర్భయ అత్యాచరం హత్యకేసులోని నలుగురు నిందితులకు నాలుగో పర్యాయం ఢిల్లీలోని పాటియాల కోర్టు డెత్ వారెంట్ జరీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తేదీ కూడా సమీపిస్తున్న తరుణంలో.. శిక్ష నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్న దోషులు మరో కొత్త ఎతుగడ వేస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ సింగ్ తన కేసులను వాదిస్తూ వచ్చిన న్యాయవాదిపైనే కేసు వేసి.. ఆయన తనను కేసులో పూర్తిగా తప్పుదోవ పట్టించారని, పోలీసులతో కుమ్మకై కేసును ఓడిపోయేలా చేశారని అరోపించాడు. అక్కడితో ఆగని దోషి ముఖేష్.. తనకు మరో న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరడంతో పాటు ఆయనతో మరోమారు కేసు పునర్విచారణకు అవకాశం ఇవ్వాలని కోరాడు.

అయితే పటియాలా కోర్టు నిర్భయ హత్యాచారం కేసులోని నలుగురు దోషులకు ఈ నెల 20న మరణశిక్ష విధించాలని డెత్ వారెంట్ జారీ చేయడంతో.. దోషులకు ఉరిశిక్ష నిమిత్తం తీహార్ జైలు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరణశిక్ష అమలుతేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా..  గత ఏడాది తాను తూర్పు ఢిల్లీలోని మండోలీ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు తనను చావబాదారని, దాంతో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని.. వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాల్సిందిగా హర్ష విహార్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఆదేశించవలసిందిగా కోరుతూ ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఓ దరఖాస్తు వేశాడు.

దీంతో  ఢిల్లీ కర్కర్ డూమా కోర్టు.. మండోలీ జైలు అధికారులకు నోటీసులు జారీ చేస్తూ.. దీనిపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగాలని ఆదేశించింది. తన దరఖాస్తులో పవన్,.. హరీష్ కుమార్ అనే కానిస్టేబుల్, మరో పోలీసు కలిసి తమ లాఠీలతో కుళ్ళబొడిచారని, తన తలపై పిడిగుద్దులు కురిపించారని పేర్కొన్నాడు. వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరాడు. తీవ్ర గాయాల పాలయిన తాను  ఆసుపత్రిలో చికిత్స పొందానని తెలిపాడు. అయితే ఈ కేసులో పవన్ తో బాటు ఇతర దోషులు వినయ్, అక్షయ్, ముకేశ్ లను మరణశిక్ష అమలు చేయాల్సిన తరుణంలో మరోమారు సందిగ్ధత నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles