Farmers can get up to Rs 3 lakh loan with KCC Scheme కిసాన్ క్రెడిట్ కార్డులతో రైతులకు పావలా రుణం

Kisan credit card farmers can get up to rs 3 lakh loan at 4 percent interest

Kisan credit card, PM-Kisan, PM Kisan Samman Nidhi Yojna, how to apply for kisan credit card, kisan credit card registration kisan credit card application

The Kisan Credit Card (KCC) scheme was launched in 1998 with the aim of providing short-term formal credit to farmers. PM Modi recently launched a saturation drive for distribution of KCC to all the beneficiaries under the PM-KISAN Scheme in Uttar Pradesh’s Chitrakoot.

కిసాన్ క్రెడిట్ కార్డులతో రైతులకు పావలా రుణం

Posted: 03/02/2020 09:08 PM IST
Kisan credit card farmers can get up to rs 3 lakh loan at 4 percent interest

అన్నదాతకు అండగా ఉండడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు(కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని భావిస్తుంది. 1998లో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా వున్న సమయంలో ఈ పథకానికి అంకురార్పణ జరగింది. అయితే ఆ తరువాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం దీనిని అమలు పర్చలేదు.

దీంతో ఈ పథకం పక్కకు పోగా.. యూపీపీ దీని స్థానంలో రైతులతో పాటు గ్రామీణులకు పనికి అహారపథకాన్ని తీసుకువచ్చారు. కాగా, రెండో దఫా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకం దుమ్ముదులిపింది. కిసాన్ క్రెడిట్ కార్డులను ఆచరణలోకి తీసుకురావాలని తలచింది, ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 25లక్షల మంది రైతులకు కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది. అసలు కిసాన్ క్రెడిట్ కార్డు ఏంటంటే.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. ఈ కేసీసీ స్కీమ్ కింద అర్హులైన అన్నదాతకు 4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తారు. అంటే పావలా వడ్డీ పడుతుంది. అయితే తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లించాలి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది.

భారతీయ స్టేట్ బ్యాంకు నిబంధనలు ప్రకారం.. తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లిస్తే.. అప్పుడు రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు అప్పు తసుకోవచ్చు. రైతులు గతంలో తీసుకున్న అప్పు కరెక్ట్ టైమ్‌‍కి కడితే అప్పు మళ్లీ వస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు అప్పు పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kisan Credit Card  KCC  Farmers  Farm Loans  PM Modi  SBI  Easy loan  4 per cent interest  25 lakh KCC cards  

Other Articles