"Happiness Class" For Melania Trump ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో్ల మెలానియా.. పిల్లలతో సరదాగా..

Us first lady melania trump arrives at govt school to attend happiness class

US president, Donald Trump, Melania Trump, hyderabad house, America, India, Business, Raj Bhavan, Raj Ghat, Mahatma Gandhi, pay Homage to Mahatma Gandhi, president house, Taj Mahal, Government school, Happiness Class, sabarmati ashram, Delhi, America, India

US First Lady Melania Trump sat down with schoolchildren at state government-run school in Delhi this afternoon as she attended the flagship "Happiness Class". Ms Trump was welcomed with a tilak by students and teachers of the Sarvodaya Co-Education Senior Secondary School in south Delhi's Moti Bagh.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో్ల మెలానియా.. పిల్లలతో సరదాగా..

Posted: 02/25/2020 04:44 PM IST
Us first lady melania trump arrives at govt school to attend happiness class

అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు వచ్చిన మెలానియాకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మెలానియా నుదుట కుంకుమ బోట్టు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆమెను స్వాగతించారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులతో మెలానియా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే హ్యాపీనెస్‌ తరగతులను అడిగి తెలుసుకున్నారు.

ఆతరువాత తరగతి గదిలో కూర్చుని హ్యాపీనెస్‌ పాఠాలు విన్నారు. సంతోషంతో పాటు నిత్యం పాజిటివ్ గా వుండేందుకు హ్యాపినెస్ తరగతులు దోహదపడతాయని అక్కడి ఉపాధ్యాయులు అమెకు వివరించారు. దీంతోపాటు విద్యార్థులలో నెలకొన్న ఒత్తిడిని కూడా హ్యాపీనెస్ తరగతులు జయిస్తాయని తెలిపారు. అంతకుముందు మెలానికా ట్రంప్ ను సంప్రదాయ దుస్తుల్లో వున్న విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. అమె మెడలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మెలానియా ట్రంప్ మాట్లాడుతూ పాఠశాలలకు తనకు లభించిన ఆత్మయ స్వాగతం అద్భుతమని అన్నారు. ఇక్కడికి తనను ఆహ్వానించినందుకు అమె కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశానికి రావడం ఇదే తొలిసారని.. ఇక్కడి వారు ఆత్మీయ స్వాగతం పలకడం, సహృదయం కలిగినవారు కావడం సంతోషంగా వున్నారు. ఇక్కడి ప్రజలు ఆదర్శప్రాయులని, విద్యార్థులు కూడా ఇక్కడ తమ తెలివితేటలతో, ప్రకృతితో మమేకయ్యేతత్వాన్ని అభ్యసించడం మరువలేనిదని అన్నారు. మంచి అరోగ్యకరమైన విద్యను అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు కూడా మేలు చేసే ప్రోత్సహించే విద్యావిధానాలు అద్భుతమని మెలానియా కితాబిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles