Trumps visit Sabarmati Ashram, try hands on charkha నేలపై కూర్చొని చరకా తిప్పిన ట్రంప్ దంపతులు

Donald trump melania spin gandhi charkha at sabarmati ashram

trump sabarmati ashram visit,Melania Trump,US President,melania spinning charkha,trump spinning charkha,gandhi charkha,Sabarmati Ashram,Donald Trump, US president, Donald Trump, Melania Trump, Sabarmati Ashram, Mahatma Gandhi, spinning charkha, gandhi charkha, Ahmedabad, Gujartat, Politics

US President Donald Trump and his wife Melania tried their hands at spinning the 'charkha' (spinning wheel) at the Sabarmati Ashram here. accompanied by PM Modi, the US president and his wife went around the Ashram, before resuming the roadshow from the airport to the Motera stadium.

ITEMVIDEOS: సబర్మతి ఆశ్రమంలో నేలపై కూర్చొని చరకా తిప్పిన ట్రంప్ దంపతులు

Posted: 02/24/2020 03:08 PM IST
Donald trump melania spin gandhi charkha at sabarmati ashram

తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు సబర్మతి ఆవ్రమం వద్ద ఘనస్వాగతం లభించింది. జాతిపిత మహాత్మగాంధీ నివసించిన నివాసం  ప్రధాని నరేంద్రమోడీ, ఆశ్రమ ప్రతినిధి ట్రంప్ దంపతులకు ఆత్మీయ స్వాగతం పలికారు. రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులు విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం ఆశ్రమంలో గాంధీ చిత్రపటానికి నూలు మాలవేశారు. ఆశ్రమం అంతా కలియతిరిగి అక్కడి విశిష్టతను తెలుసుకున్నారు.

ట్రంప్‌ దంపతులు గాంధీ నివాసంలోని అణువణువూ తిప్పి అక్కడి ప్రత్యేకతలను, విశిష్టతలను ప్రధాని వారికి వివరించారు. ఈ క్రమంలో గాంధీ ప్రతి రోజు గంట సమయం పాటు చరఖా తిప్పేవారని తెలిపారు. ఈ క్రమంలో వారు నేలపై కూర్చోని.. గాంధీజీ తిప్పిన చరఖా తిప్పి నూలు వడికడం విశేషం. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న మూడు కోతుల సందేశాత్మక విగ్రహాలను మోదీ వారికి చూపించారు. వీటిని జపాన్ కు చెందిన సాధువులు గాంధీజీకి బహుమానంగా ఇచ్చారని, దీంతో అవి అధిక ప్రాచుర్యాన్ని పోందాయని చెప్పారు. ఈ బోమ్మల వెనుక వెనుక ఉన్న సందేశాన్ని వివరించారు. తర్వాత సందర్శకుల పుస్తకంలో ట్రంప్, మెలనియా తమ సందేశాలను రాసి సంతకం చేశారు.

అంతకుముందు భాతర దేశ తొలి పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ట్రంప్‌ దంపతులకు మోదీ సాదర స్వాగతం పలికారు. ట్రంప్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌, ఇతర అధికారులతో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. విమానాశ్రయంలో గుజరాత్‌ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. అనంతరం విమానాశ్రయం నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ కిలోమీటర్ల మేర దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా దారి పొడవునా వివిధ ప్రాంతాల్లో భారతీయ సంప్రదాయ, జానపద నృత్యాలతో కళాకారులు అడుగడునా నీరాజనం పలికారు. ట్రంప్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలతో అహ్మదాబాద్‌ నగరం జనసంద్రంగా మారింది. తొలుత ట్రంప్‌, ప్రధానిమోదీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం వీరు మోతెరా స్టేడియానికి వెళ్లనున్నారు. ట్రంప్‌ పర్యటన సందర్భంగా నగరమంతా ఎటు చూసినా మోదీ, ట్రంప్‌ ప్లెక్సీలతో నిండిపోయింది. అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వాహనంలో కూర్చున్న ట్రంప్‌ .. ప్రజలకు అభివాదం చేశారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles