BJP MP calls Mahatma Gandhi’s freedom struggle a ‘drama’ జాతీపితపై నోరుజారిన బీజేపి ఎంపీ.. చర్యలేవి.?

Bjp mp ananth kumar hegde calls mahatma gandhi s freedom struggle a drama

Mahatma Gandhi, freedom struggle, drama, BJP MP, Ananth Kumar Hegde, controversial statement, amebdkar, B N Rau, BN Rau, bn rau constituent assembly, Brahmin, brahmin dna, brahmin supremacy, gujarat assembly speaker, rajendra trivedi, Bharatiya Janata Party, Polictics

Bharatiya Janata Party MP and former union minister Ananth Kumar Hegde has stirred yet another controversy. This time for attacking Mahatma Gandhi and calling the freedom struggle led by him a “drama”

జాతీపితపై నోరుజారిన బీజేపి ఎంపీ.. చర్యలేవి.?

Posted: 02/03/2020 01:09 PM IST
Bjp mp ananth kumar hegde calls mahatma gandhi s freedom struggle a drama

ధేశ స్వాతంత్ర్య సమరంలో ఎలాంటి సామాజిక మాద్యమాలు, కనీసం దినపత్రికలను కూడా స్వేఛ్ఛగా నడుపుకునే పరస్థితులు లేని రోజుల్లో.. సంగ్రామ పోరుకు దేశ ప్రజలను సమీకరించి.. అందరినీ ఏకతాటిపై నడిపించిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.. మన మహాత్ముడు, జాతిపిత గాంధీపై స్వతంత్ర్య స్వేచ్ఛావాయువును పీల్చుతున్న ఏడు పదులు సంవత్సరాల తరువాత ఇప్పటి నాయకులు, అందులోనూ కేంద్రమంత్రులుగా బాధ్యతలను చేపట్టిన నాయకులు మహాత్ముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం.

ఇటీవల గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ కాదని, అతనికి అందించింది బిఎన్ రావ్ అని.. ఆయన బ్రాహ్మణుడని.. వ్యాఖ్యలు చేసి.. అంబేద్కర్ గౌరవాన్ని కుదించే చర్యలకు పాల్పడ్డారు. తాజాగా మరో బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మహాత్ముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గాంధీని దేశానికి మహాత్ముడని పిలవడం దౌర్భాగ్యమని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఆయన నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఓ డ్రామాగా పోల్చడం కలకలం రేపుతోంది.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని అంతా డ్రామాగా అభివర్ణించారు. ఆయనను ‘మహాత్మా’ అని ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. గాంధీ నడిపిన స్వాతంత్ర్య పోరాటం మొత్తం బ్రిటిషర్ల అనుమతితో, వారి ప్రోద్బలంతోనే సాగిందని ఆరోపించారు. వీరెవరికీ ఒక్క లాఠీదెబ్బ కూడా తగల్లేదన్నారు. గాంధీ నడిపిన స్వాతంత్ర్యోద్యమం నిజమైనది కాదని, బ్రిటషర్లతో కుమ్మక్కయి నడిపిన నాటకమని హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదో సర్దుబాటు స్వాతంత్ర్య ఉద్యమమని ఆరోపించారు.

అక్కడితో ఆగని హెగ్డే.. మరో అడుగు ముందుకేసీ గాంధీ నిరాహార దీక్ష, సత్యాగ్రహ దీక్షలు కూడా నాటకమేనని తూలనాడారు. వాటివల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కాంగ్రెస్ మద్దతుదారులు చెబుతున్నదాంట్లో ఇసుమంతైనా నిజం లేదన్నారు. బ్రిటిష్ వాళ్లకు భారతదేశంపై విసుగుపుట్టే వెళ్లిపోయారని కొత్త భాష్యం చెప్పారు. చరిత్ర చదువుతుంటే తన రక్తం మరిగిపోతుంటుందని, ఇలాంటి వాళ్లు మన దేశంలో మహాత్ములని గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంత్ కుమార్ హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపి, బీజేపి విధానాలను వ్యతిరేకించే వారిని దేశదోహ్రులుగా, పాకిస్తానీయులుగా ముద్ర వేసే స్థాయి నుంచి అనంత్ కుమార్ లాంటి నేతలు మరో అడుగు ముందుకేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. యావత్ దేశం బడ్జెట్ లెక్కలను చూసుకునే పనిలో నిమగ్నమై వుండగా, అదునుచూసి స్వాతంత్ర్యయోధులను తూలనాడే విధంగా బీజేపి నేతలు వ్యాఖ్యాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దేశ సమరయోధులపై వ్యాక్యలు చేస్తున్నా ఈ నేతలను మాత్రం శిక్షించకుండా.? చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా, అసలు వీరిపై కేసులు పెట్టకుండా.? ఎందుకు ఉపేశిస్తున్నారన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి.

ఇక ఇలాంటి నేతలు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నా.. వాటిని ఖండించడానికి నాయకులు తప్ప సగటు ప్రజలు ఎవరూ ముందుకు రావడానికి సాహసించడం లేదు. ఒకవేళ సాహించే సామాన్యులను అర్బన్ నక్సల్ అని ఎక్కవ ముద్ర వేస్తారో.. లేక దేశద్రోహులంటూ ఎక్కడ కేసులు బనాయిస్తారోనన్న అందోళన ప్రజల్లో నిగూఢమై వుంది. ఇక ఈ నేపథ్యంలో రానురాను దేశానికి అసలైన స్వతంత్ర్యం తీసుకువచ్చింది ఎవరు.? అన్న విషయమై కూడా పెద్ద చర్చకు దారితీసే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వతంత్ర్య దేశంలో స్వతంత్ర సంగ్రామ పోరు కన్నా దేశంలో జరుగుతున్న సంగ్రామాలపై.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles