Budget gives option of lower income tax rates బడ్జెట్ 2020: కొత్త పన్ను విధానంతో రాయితీలకు శఠగోపం

Budget gives option of lower income tax rates new tax slabs minus 70 exemptions

PM Modi, Niramala sitharaman, Budget2020, income, Finance Ministry, tax news, Tax, piyush goyal, income tax, income tax rates, income tax slabs, budget, budget updates, Politics

Finance Minister Nirmala Sitharaman in Union Budget 2020 has offered tax payers the option to choose between the existing income tax regime and a new regime with slashed income tax rates and new income tax slabs but no tax exemptions.

బడ్జెట్ 2020: కొత్త పన్ను విధానంతో రాయితీలకు శఠగోపం

Posted: 02/01/2020 07:56 PM IST
Budget gives option of lower income tax rates new tax slabs minus 70 exemptions

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో నూతన పన్నువిధానాన్ని అందించారు. పాత పద్దతిలో పన్ను కడతారో లేక నూతన విధానం ఎంచుకుంటారో పన్ను చెల్లింపుదారుల ఇష్టమని అమె చెప్పారు. అయితే ఈ స్లాబ్ ల ప్రకారం చూస్తే నూతన పన్ను విధానం బాగుంది అనేవాళ్ల సంఖ్య అధికంగా వుంది. మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏకంగా రూ. 78 వేల వరకు ఈ విధానం ద్వారా ఆదా అవుతుందన్న విషయాన్ని చెప్పారు. కానీ ఓ సారి లోతుగా అధ్యయనం చేస్తే.. అసలు వివరం తెలుస్తుంది. నూతన విధానం తమ తలలపై శఠగోపం పెడుతుందని.. అదెలా అంటే..  

కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయం ఎంతో వెల్లడించి పన్ను చెల్లించాల్సి ఉంటే అంత శాతం పన్ను చెల్లిస్తే చాలు. అదే పాత విధానంలో మినహాయింపులన్నీ పొందొచ్చు. బడ్జెట్ లో కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు, తక్కువ రేట్లు ప్రతిపాదించారు. ఈ ఆదాయపు పన్ను రేట్లు ఆప్షనల్. అంటే కొన్ని మినహాయింపులు, కొన్ని తగ్గింపులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. ఉపశమనాలు, మినహాయింపులు వదులుకునే వారికి కొత్త ఆదాయపు పన్ను రేట్లు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర మంత్రి నిర్మల అన్నారు. వచ్చే 2021-22 మదింపు సంవత్సరం లేదా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ పన్ను సంస్కరణలతో ప్రభుత్వంపై వార్షికంగా రూ.40వేల కోట్ల భారం పడనుంది.

కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబ్స్ చూస్తే..
* రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5% పన్ను
* రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10% పన్ను (గతంలో 20శాతం పన్ను)
* రూ.7.5 లక్షల నుంచి రూ.లక్షల వరకు 15% పన్ను (గతంలో 20శాతం పన్ను)
* రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20% పన్ను (గతంలో 30శాతం పన్ను)
* రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25% పన్ను (గతంలో 30శాతం పన్ను)
* రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి

కొత్త పన్ను విధానం చర్చకు దారితీసింది. దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్త పన్ను విధానంపై ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త పన్ను విధానం వల్ల ట్యాక్స్ పేయర్లకు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రేటు తగ్గించారు, దీని వల్ల ఊరట లభిస్తుందని కేంద్రం చెబుతున్నా.. వాస్తవంగా మాత్రం నష్టమే ఎక్కువ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కొత్త పన్ను విధానంతో కలిగే నష్టాలు:
* ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు కోల్పోతారు. 
* జీతంలో భాగంగా వేతన జీవులకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ ను ట్యాక్స్ కింద పరిగణిస్తారు.
* వేతన జీవులకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు కోల్పోతారు.
* సెక్షన్ 16 కింద ఇచ్చే వినోద అలవెన్స్, వృత్తి పన్ను కోల్పోతారు.
* హౌసింగ్ లోన్ పై కట్టే వడ్డీపై రాయితీ కోల్పోతారు. సెక్షన్ 24 కింద ఈ రాయితీ ఇస్తున్నారు.
* సెక్షన్ 57 కింద ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ రూ.15వేలు డిడక్షన్ కోల్పోతారు.
* సెక్షన్ 80సీ కింద ఇచ్చే డిడక్షన్లు కోల్పోతారు. (ఫండ్ కాంట్రిబ్యూషన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్, స్కూల్ ట్యూషన్ ఫీజు).
* సెక్షన్ 80డీ కింద ఇప్పటివరకు పొందుతున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం డిడెక్షన్ కోల్పోతారు.
* సెక్షన్ 80డీడీ, 80డీడీబీ కింద పొందే ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోలేరు.
* సెక్షన్ 80ఈ కింద ఎడ్యుకేషన్ లోన్ మీద చెల్లించే వడ్డీని క్లెయిమ్ చేసుకోలేరు.
* స్వచ్చంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై రాయితీ కోల్పోతారు. ఇప్పటివరకు సెక్షన్ 80జీ కింద రాయితీ పొందుతున్నారు.

80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA సెక్షన్ల కింద పొందే రాయితీలన్నీ.. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే.. కోల్పోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles