Court adjourns Hajipur serial killings case to Jan 6 కోర్టులో ‘హాజీపూర్‌’ నిందితుడి బుకాయింపులు..

Nalgonda court adjourns hajipur serial killings case to january 6

Srinivasa Reddy, Hazipur, Kalpana, Maneesha, Shravani, sexual assault, rape, murder, Bommlaramaram, Yadadri-Bhongir, Nalgonda court, posco act, allegations on police, Telangana, Crime

First Additional District and Sessions Judge court, which is dealing POCSO cases, posted the case to January 6 after the examination of the accused Marri Srinivas Reddy under Section 313 CrPC. Srinivas Reddy was accused in the rape and killing of three minor girls at Hazipur village.

కోర్టులో ‘హాజీపూర్‌’ నిందితుడి బుకాయింపులు.. విచారణ 6కు వాయిదా..

Posted: 01/04/2020 05:13 PM IST
Nalgonda court adjourns hajipur serial killings case to january 6

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ వరుస హత్యాచార కేసులతో తనకెలాంటి సంబంధం లేదని...కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి న్యాయస్థానానికి మరోసారి వెల్లడించాడు. పోలీసులు తనకు ఇంజెక్షన్లు ఇచ్చి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారని, ఆ బాలికల హత్యలకు, తనకు సంబంధం లేదని శుక్రవారం గట్టిగా వాదించాడు. నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది.

సాక్షులు ఇటీవల కోర్టుకు వెల్లడించిన వాంగ్మూలాలను న్యాయమూర్తి నిందితుడికి వినిపించగా...అవన్నీ అబద్ధాలన్నాడు. వాంగ్మూలాలపై అభిప్రాయాలను న్యాయమూర్తి నమోదు చేస్తున్న క్రమంలో తనకు ఫోన్లే లేవని శ్రీనివాస్‌రెడ్డి అనడంతో...‘‘ఫోన్‌ లేకుంటే నీ నుంచి పోలీసులు మూడు సిమ్‌కార్డులు ఎలా స్వాధీనం చేసుకున్నారు’’అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో నిందితుడు తన వద్ద చిన్న ఫోన్‌ మాత్రమే ఉందని సమాధానమిచ్చాడు. చిన్న ఫోన్‌ మాత్రమే ఉంటే పోలీసులు నీ నుంచి రెండు స్మార్ట్‌ ఫోన్లు ఎలా స్వాధీనం చేసుకున్నారని...అందులో నువ్వు నీలి చిత్రాల వీడియోలు చూసేవాడివని ఫోరెన్సిక్‌ నివేదికలో  వెల్లడైందని న్యాయమూర్తి జవాబివ్వడంతో శ్రీనివాస్‌రెడ్డి మౌనంగా ఉండిపోయాడు.

మనీషా, కల్పన, శ్రావణి హత్యాచారకేసుల్లో  101 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. వీటిపై శుక్రవారం నిందితుడి అభిప్రాయాలను నమోదు చేసింది. గత నెల 26న జరిగిన వాదనల్లో తన తరఫున తల్లిదండ్రులను పిలవాలని నిందితుడు కోరగా... చిరునామా తెలియకపోవడంతో కోర్టు వారికి సమన్లు పంపలేదు. దీంతో శుక్రవారం వారు కోర్టుకు హాజరుకాలేదు. ఇరు పక్షాల న్యాయవాదుల సమ్మతి మేరకు న్యాయమూర్తి విచారణను ఈ నెల 6కి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivasa Reddy  Hazipur  Kalpana  Maneesha  Shravani  sexual assault  rape  murder  Bommlaramaram  Yadadri-Bhongir  Telangana  Crime  

Other Articles