crusial cabinet meet concluded details awaited ముగిసిన క్యాబినెట్ బేటీ.. కాసేపట్లో వివరాలు.. సర్వత్రా ఉత్కంఠ

Crusial cabinet meet concluded farmers anxious for details

YS Jagan, Cabinet Meet, Perni Nani, Kanna Babu, Capitals, Amaravati protesters, Dhulipala Narendra, Devineni Uma, Amaravati Bandh, !44 Section, Police forces beefedup, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

The crucial cabinet meeting on three capitals presiding Andhra Pradesh Chief Minister YS JaganMohan Reddy, concluded at Amaravati on Friday. I and PR Minister Perni Nani will disclose the details in a short time amid high anxiety of farmers of Amaravati.

ముగిసిన క్యాబినెట్ బేటీ.. కాసేపట్లో వివరాలు.. సర్వత్రా ఉత్కంఠ

Posted: 12/27/2019 01:29 PM IST
Crusial cabinet meet concluded farmers anxious for details

మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్రానికి మూడు రాజధానుల విషయమై సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ సుదీర్ఘ సమావేశం మూడు గంటల పాటు సాగింది. అమరావతిలోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపై క్యాబినెట్ చర్చించింది. వీటిలో రాజధానితో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫార్సులు చేసిన జీఎన్‌రావు కమిటీ నివేదికపై కేబినెట్‌ సమగ్రంగా చర్చించామని మంత్రి కన్నబాబు తెలిపారు.

ఈ బేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు రాజధానుల అంశంమై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నారు. అయితే బీసీజీ నివేదిక కూడా రావాల్సివున్న క్రమంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకుని చర్చ జరిగిందని.. అయితే సమావేశ వివరాలను పౌరసమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు అందిస్తారని తెలిపారు. ఈ తరుణంలో జీఎన్‌రావు కమిటీ నివేదికను క్యాబినెట్ కమిటీ యథాతథంగా ఆమోదిస్తుందా? లేదా మార్పులేమైనా చేస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

రాజధాని అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి నివేదిక అందజేసింది. కాగా, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా నిరసనలు, అందోళనలు చేపట్టిన అమరావతి రైతులు మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదనే అంశంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇవాళ మంత్రివర్గ సమావేశం సమయంలో రాజధాని పరిధిలోని అనేక గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.

రాజధానిని మార్చవద్దంటూ గొల్లపూడి వద్ద ధర్నా చేసిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. గొల్లపూడి-1 సెంటర్‌ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. అటు వెలగపూడిలోనూ రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది.

వెలగపూడిలో రైతుల ఆందోళనలో సర్కిల్ ఇన్స్ పెక్టర్, ఎస్ఐలకు గాయాలయ్యాయి. కారు వెళ్లనీయకుండా అడ్డుకున్న గ్రామాస్థులను చెదరగొట్టే క్రమంలో అందోళనకారులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. కారుకు రక్షణగా వున్న సీఐ, ఎస్ఐలను తోసిన అందోళనకారులు కారును ధ్వంసం చేయడంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. ఒక వైపు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుండగా.. మరోవైపు మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి రైతులు, మహిళలను ఆందోళన చేపట్టారు.

ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం త్యాగాలు చేస్తే.. ఆ త్యాగాలను అవమానించేలా రాజధానిని మారుస్తారా? అంటూ వారు అమరావతి రైతులు మండిపడుతున్నారు. కేవలం అసెంబ్లీని అమరావతిలో ఉంచితే లాభమేంటని, పూర్తి స్థాయి రాజధాని ఇక్కడే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. అందోళన చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారును చుట్టుముట్టిన మహిళలు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.

గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని స్టేషన్‌కు తరలించారు. శాంతియుత నిరసనలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మందడంలో నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో మహిళలంతా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎర్రబాలెంలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోడ్డుపై టైర్లు కాల్చి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని అంశంపై తీరు మార్చుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles