Vijayasai caste politics backfire at Kapu gettogether కాపుల ఆత్మీయ కలయికలో విజయసాయిరెడ్డికి పరాభవం..

Setback to vijayasai reddy at visakha kapu gettogether

setback to vijayasai reddy, Kapu ‘Vanamahotsavam’, Kapu Garden Party, Avanti Srinivas, Vijayasai Reddy, Kapu Get-together, Kambalakonda, visakhapatnam, Andhra Pradesh, Politics

I am also a Kapu community person. It is there in my certificates. My death certificate will also carry Kapu caste name. This is how CM Jagan’s most trusted MP Vijayasai Reddy went on desperately speaking at a Kapu ‘Vanamahotsavam’ garden party. The event was held at Kambalakonda near Visakhapatnam.

కాపుల ఆత్మీయ కలయికలో విజయసాయిరెడ్డికి పరాభవం..

Posted: 12/16/2019 11:22 AM IST
Setback to vijayasai reddy at visakha kapu gettogether

విశాఖపట్టణంలో నిర్వహించిన ‘కాపుల ఆత్మీయ కలయిక’ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పరాభవం ఎదురైంది. తాదివరకెన్నడూ ఎరుగని, ఊహించని అనుభవం కావుల ఆత్మీయ కలయికలో ఆయన చవిచూశారు. జిల్లాలోని కండాల కొండలో కాపులు ఆత్మీక కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు విజయసాయిరెడ్డి, పలువురు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.

విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలను చూసిన కాపులు మండిపడ్డారు.ఉన్నఫలంగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతేకాదు ‘జై  కాపు.. జైజై కాపు’ అని నినదించారు. కాపుల సమావేశానికి వైసీపీ నేతలందరూ ఎలా వస్తారని కార్యక్రమానికి వచ్చిన ఇతర నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో కార్యక్రమంలో కొంతసేపు రసాభసగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవిలో ఉండడం వల్లే సహనంగా ఉన్నానని తీవ్ర స్వరంతో అన్నారు. జిల్లా నుంచి  తనకు మాత్రమే మంత్రి పదవి దక్కిందన్నారు.

కాగా, పలువురు నేతలు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగా మంత్రి అవంతి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో అటువంటివి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు విజయసాయిరెడ్డి కాపు సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. తానూ కాపునేనని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రేపు తాను చనిపోయినప్పుడు తన డెత్ సర్టిఫికెట్ మీద కూడా అదే ఉంటుందన్నారు. అయినా ఆయన మాటలను అలకించేందుకు కొందరు కాపులు సుముఖంగా లేకపోవడంతో.. ఆయన బదులుగా అవంతి మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles