Two NRI students died in road Accident అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

Two nri students died in road accident in america

NRI Students, USA, Gopisetty, Vybhav Gopisetty, Judy Stanley, South Nashville, Tennessee State University, GoFundMe, David Torres, America, Crime

Among vastly growing NRI deaths in the US, another case yesterday left two Indian families in grief and pain. A horrific road mishap led two Indian students, namely, Vybhav Gopisetty(26) and Judy Stanley(23), die on the night of Thanksgiving.

అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

Posted: 12/02/2019 11:19 AM IST
Two nri students died in road accident in america

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అసువులు బాసారు. టెనస్సీ రాష్ట్రంలోని నాష్ విల్లేలో థ్యాంక్స్ గివ్వింగ్ డే రోజున (నవంబర్ 28) జరిగిన ఈ దుర్ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరిలో ఒకరు తెలుగు విద్యార్థి. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గత నెల 28న ధ్యాంక్స్ గివ్వింగ్ డే సందర్భంగా టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ అఫ్ అగ్రికల్చర్ లో ఫుడ్ సైన్స్ డిగ్రీని చదువుతున్న జైడీ స్టాన్లీ (23) తో పాటుగా తెలుగు విద్యార్థైన వైభవ్ గోపిశెట్టి (26)లు తమ కారులో బయటకు వెళ్లారు. కాగా వీరు ప్రయాణిస్తున్న కారును డేవిడ్ టోరెన్ అనే వ్యక్తి తన ట్రక్కుతో ఢీకొట్టాడు. ట్రక్కు కారును వెనుకగా బలంగా ఢీకోనడంతో దుర్ఘటనాస్థలంలోనే వారు మరణించారు. ట్రక్కును నడిపిన డేవిడ్ టోరిస్ (28) ఆ వెంటనే పరారీలోకి వెళ్లాడు. తరువాత ఈ నెల 1న పోలీసుల ముందు లోంగిపోవడంతో ప్రమాదం జరగిన విషయం పోలీసులకు తెలియవచ్చింది.

కాగా తమ ఇద్దరు సహచరుల ఆకస్మిక మృతి పట్ల అందోళన చెందిన టెనస్సీ విశ్వవిద్యాలయం విద్యార్థులు.. వారిద్దరి బౌతిక కాయాలను భారత్ పంపించేందుకు, అక్కడ దహన సంస్కారాలను చేపట్టే నిమిత్తం 42 వేల డాలర్లు గో ఫండ్ మి పేజీ ద్వారా విరాళాలను రాబట్టారు. ఇక ఆ కళాశాల అసిస్టెంట్ ఫ్రోఫెసర్ భారత్ పోహ్రాల్ తన పేస్ బుక్ పేజీలో ఇద్దరు విద్యార్థుల మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారు చాలా అనుకువ, అమాయక, శ్రమించే యువకులని, ఇద్దరికీ భవిష్యత్తుపై చక్కని అవగాహన వుందని, అయితే బావి వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదిగే వీరిని మృత్యుశకటం కబళించి వేసిందన్న వార్తను నమ్మలేకపోతున్నానని ఆయన పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles