bank likely to auction former minister assets మాజీ మంత్రికి బ్యాంకు అధికారుల షాక్.. అస్తుల వేలానికి ‘గంట’

Bank officials likely to auction former minister ganta srinivasa rao assets

Ganta Srinivasa Rao assets to be auctioned, former ministers assets to be auctioned, Ganta Srinivasa Rao assets vizag, Ganta Srinivasa Rao defaulter, Ganta Srinivasa Rao, Vizag, Bank Officials, Auction, Loan, Government lands, Defaulter, TDP, andhra pradesh, politics

Bank officials are likely to auction former Andhra Pradesh Minister Ganta Srinivasa Rao assets in Vizag, after he is said to be declared as defaulter in repaying the loan interest and amount.

మాజీ మంత్రికి బ్యాంకు అధికారుల షాక్.. అస్తుల వేలానికి ‘గంట’

Posted: 11/18/2019 11:07 AM IST
Bank officials likely to auction former minister ganta srinivasa rao assets

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రికి బ్యాంకు అధికారులు షాక్ ఇవ్వనున్నారు. ఆయనకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి త్వరలో గంట మ్రోగించనున్నారు. ఇంతకీ ఆయన ఎవరనేగా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ మాజీ మంత్రి రుణం పోంది.. రుణంతో పాటు వడ్డీని కూడా చెల్లించకపోవడంతో రుణ ఎగవేతదారుడిగా (డీఫాల్టర్ గా) వున్నారు. దీంతో ఆయన ఆస్తులు వేలానికి బ్యాంకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న వేలం నిర్వహించాలని బ్యాంకు నిర్ణయించినట్లు సమాచారం. సుమారు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఆయన రుణం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన కంపెనీ ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం పొందారు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆయన రుణ ఎగవేతదారుడికి బ్యాంకు ముద్రవేసింది. దీంతో ఆయన రుణం పోందేందుకు బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేస్తున్నట్లు చెబుతున్నారు. రుణ బకాయిలు సుమారు రూ.209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు. మిగతా బకాయిల కోసం ఆయనకు చెందిన వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే యోచనలో బ్యాంకు అధికారులు వున్నారని ఆయా వర్గాల సమాచారం.

ఇదిలావుండగా, ప్రభుత్వ భూములను కూడా తనఖా పెట్టి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా తన పరపతిని వినియోగించి భారీగా రుణాలు పొందారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలుతో ఇండియన్ బ్యాంకులో తనఖా పెట్టిన అస్తులకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు వెల్లడించారు. తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తులన్నీ ప్రైవేటు ఆస్తులేనని తెలిపారు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganta Srinivasa Rao  Vizag  Bank Officials  Auction  Loan  Government lands  Defaulter  TDP  andhra pradesh  politics  

Other Articles