lv subramanyam goes on one month leave బాధ్యతలు అప్పగించి సెలవుపై వెళ్లిన ఎల్వీ సుబ్రహ్మణ్యం

Former chief secretary lv subramanyam goes on one month leave

LV Subramanyam, Chief Secretary, NirabKumar Prasad, CM YS Jagan, APHRD DG, Incharge CS, Andhra Pradesh, Politics

Andhra pradesh former chief secretary LV Subramanyam goes on one month leave, with out taking charge as Director General of AP Human Resources Development Institute, at Bapatla.

బాధ్యతలు అప్పగించి సెలవుపై వెళ్లిన ఎల్వీ సుబ్రహ్మణ్యం

Posted: 11/06/2019 04:14 PM IST
Former chief secretary lv subramanyam goes on one month leave

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకారణంగా తనపై వేసిన బదిలీ వేటుతో తీవ్ర మానసిక వేదనకు గురైన రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంఛార్జి సీఎస్‌గా నియమితులైన నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ కు బాధ్యతలను అప్పగించిన తరువాత ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్డీ) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా బాధ్యతలు చేపట్టకుండానే ఆయన సెలవు పెట్టనున్నారు. డిసెంబర్‌ 6 వరకు సెలవు పెట్టినట్లు సమాచారం.

సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. బాపట్లలోని ఏపీహెచ్ఆర్డీ సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేసింది. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్‌) కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం, ప్రాధాన్యం లేని హెచ్‌ఆర్‌డీ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించడం అధికార, రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది. ప్రతిపక్ష పార్టీలు ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఆయన నెలరోజుల పాటు సెలవుపై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles