BJP criticises lack of development under YSRCP పరిశ్రమలు తిరిగెళ్తున్నా.. ప్రభుత్వానికి పట్టదా.?: బీజేపి

Deodhar wake up call to cm jagan on industries

Sunil Deodhar, Jagan, YSRCP Government, BJP, Industries, Industrial sector, Adani Group, Reliance Electronics, Andhra Pradesh, BJP

BJP AP Co-Incharge Sunil Deodhar began his strongest ever criticism of Jaganmohan Reddy government. Deodhar advised Jagan to wake up and do some damage control as thousands of crore worth industries are migrating from Andhra to other states.

పరిశ్రమలు తిరిగెళ్తున్నా.. ప్రభుత్వానికి పట్టదా.?: జగన్ సర్కారుపై బీజేపి ఫైర్

Posted: 11/04/2019 01:09 PM IST
Deodhar wake up call to cm jagan on industries

వైఎస్ జగన్ పాలన, తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపి తీవ్రస్థాయిలో మండిపడింది. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు దిశగా అడుగులు వేయడం లాంటి నిర్ణయాల పట్ల కేంద్రం అసంతృప్తితో ఉంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయని, విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయని కేంద్రం ఆందోళన చెందుతోంది. అంతే గాకుండా.. ఏపీలో ఎలాగైనా ఎదగాలని భావిస్తోన్న బీజేపీ.. ఫోకస్‌ను టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు మళ్లిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ హయాంలో తమ సంస్థల ఏర్పాటును ప్రకటించిన సంస్థలు తిరిగి వెళ్లిపోవడంపై స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రం నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలు వెనుకంజ వేస్తున్నాయని బీజేపి విమర్శలు చేసింది. చంద్రబాబు హయాంలో రూ.70 వేల కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అదానీ గ్రూప్.. తాజాగా ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌కు మార్చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపి రాష్ట్ర సహా ఇంచార్జ్ సునీల్ దవ్ ధర్ ఈ మేరకు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. అదానీతో పాటు రూ. 15 వేల కోట్ల విలువైన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా ఏపీ నుంచి తరలి వెళ్తోందని ఆయన ఘాటుగా స్పందించారు.   

ఏపీ రాష్ట్ర సొంత ఆదాయం జీతాలకు, అప్పుల వడ్డీల చెల్లింపులకే సరిపోవడం లేదన్న ఆయన ఎవరైనా అప్పులు చేసి సంక్షేమ పథకాలను ఇస్తారా.? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన నవరత్నాల హామీలకు సంపాదించి ఖర్చు పెట్టాలి గానీ అప్పులు చేసి కాదని ఇకనైనా ఆయన మేలుకోవాలని సునీల్ దేవ్‌ధర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంపై రూ.3.5 లక్షల కోట్ల మేర అప్పుల భారం ఉందన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌తోపాటు చమురు, సహజవాయు వెలికితీత కోసం గతంలో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌‌పై విముఖత చూపుతోంది. ఎలక్ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి చూపడం లేదని.. మేం సంప్రదిస్తున్నా.. అటు నుంచి స్పందన లేదని మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles