BSNL takes on Jio with '6-paise' plan బంఫర్ ఆఫర్: ఔట్ గోయింగ్ కాల్స్ పై క్యాష్ బ్యాక్..

Bsnl will credit money in your account for every voice call

BSNL, BSNL user, BSNL plan, Jio user, BSNL package, BSNL cash back, BSNL cash back offer, BSNL landline, BSNL broadband, BSNL FTTH Customers, Telecom industry, telecom competiters, BSNL telecom service provider

State-owned telecom operator BSNL is coming up with an offer that will be hard to deny. In a first of its kind, the company is giving 6 paise for every five minutes of voice calls placed by the subscribers. The move is applicable on BSNL's wireline, broadband and FTTH customers.

టెలికాం సంస్థ బంఫర్ ఆఫర్: ఔట్ గోయింగ్ కాల్స్ పై క్యాష్ బ్యాక్..

Posted: 11/01/2019 04:53 PM IST
Bsnl will credit money in your account for every voice call

రిలయన్స్ జియో వాడే ప్రతీ ఒక్కరికి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామని లాంచింగ్ సందర్భంగా ఆ సంస్థ సీఎండీ చెప్పిన మాటలను నమ్మిన కస్టమర్లు ఒక్కరి వెంట ఒకరుగా బారులు తీరి మరీ జియో నెట్ వర్క్ సంస్థ కస్టమర్లుగా మారారు. దీంతో జియో సంస్థ అనతికాలంలోనే నెంబర్ వన్ టెలికామ్ సర్వీస్ ప్రోవైడర్ స్థానానికి ఎదిగిపోయింది. అయితే ఇలా అగ్రస్థానాన్ని అక్రమించుకుందో లేదో ఆ సంస్థ తనలోని వ్యాపార కోణాన్ని బయటపెట్టింది. అంతే ఇక దేశవ్యాప్తంగా అనేక మంది జియో నెట్ వర్క్ ను ట్రోల్ చేస్తూ.. ఎంఎన్పీ ద్వారా ఇతర నెట్ వర్కులలోకి వెళ్తున్నారు.

ఇంతకీ అంతలా ఏం చేసిందంటే.. జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్ కు చార్జీలు వసూలు చేస్తోంది. నిమిషానికి అరు పైసల చోప్పున లాగేస్తోంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఈ ట్రోలింగ్ ను వేరే స్థాయికి తీసుకెళ్లింది. అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకునే తమ వినియోగదారులకు ప్రతి ఐదు నిమిషాలకు ఆరు పైసల చొప్పున అందించనుంది. తమ ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఫైబర్ టు హోం కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. బీఎస్ఎన్ఎల్ తీసుకున్న అత్యుత్తమ వ్యూహాత్మక నిర్ణయాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

జియో కాల్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించడంతో వేరే నెట్ వర్క్ ల వైపు చూసే ప్రజలకు బీఎస్ఎన్ఎల్ ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్ యుగంలో వినియోగదారులు వాయిస్ కాల్స్, డేటా విషయంలో నాణ్యతని కోరుకుంటున్నారని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్న తమ నెట్ వర్క్ ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తూ అదేవిధంగా వారు కాల్స్ మాట్లాడినప్పుడు ఇలా క్యాష్ బ్యాక్ అందిస్తామని తెలిపింది.

గత మూడేళ్లలో భారతదేశ టెలికాం రంగంలో చాలా మార్పులు వచ్చాయి. రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చాక దానికి తగ్గట్లు మిగతా నెట్ వర్క్ లు కూడా పెనుమార్పులు చేయక తప్పలేదు. జియో దెబ్బకి దేశంలో కొన్ని నెట్ వర్క్ లు ఏకంగా కనుమరుగయ్యాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రమే జియోని కాస్తో కూస్తో తట్టుకుని మార్కెట్లో నిలబడ్డాయి. ఐయూసీ చార్జీల కారణంగా ఈ మూడేళ్లలో మొదటిసారి జియో ఈ విభాగంలో వెనుకపడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles